శ్రీశైలం జలాశయంలో ఒకవైపు నీటిమట్టం వేగంగా పడిపోతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండగా.. కుడి విద్యుత్ కేంద్రంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రోజుకు ఒక టీఎంసీకి పైగానే విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుండడంతో సమీప కాలంలోనే శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది..
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కంటే ఎక్కువగా... వలసల మీదే ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోందట. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక వన్ బై వన్ కీలక నేతలు సైతం బైబై చెబుతుండటం, అందుకు అధిష్టానం నుంచి కనీస స్పందన లేకపోవడం గురించి నాయకులంతా తెగ చెవులు కొరికేసుకుంటున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని, మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు లాంటి ముఖ్య నాయకులతోపాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి,…
పోసానికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. లక్ష రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది.. ఇక, వారానికి రెండు రోజులు సీఐడీ రీజనల్ ఆఫీసుకి వచ్చి సంతకాలు చేయాలని షరతులు విధించింది.. విచారణకు పూర్తిగా సహకరించాలి.. ఈ సమయంలో దేశం విడిచి వెళ్లకూడదు.. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదు.. పత్రికల్లో ఎటువంటి ప్రకటనకు చేయకూడదు అని గుంటూరు కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడలో భాగంగా మెడికల్ షాప్స్ మీద మెరుపు దాడులు జరిగాయి. 100 బృందాలతో ఈ తనిఖీలు చేపట్టారు. మందుల షాపులు, మందుల ఏజెన్సీలపై ఈ దాడులు చేశారు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో మెరుపు దాడులు కొనసాగాయి..
సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి బెయిల్ వచ్చినా జైలు నుంచి విడుదలకు మోక్షం మాత్రం కలగడంలేదు.. ఈ రోజు బెయిల్ పేపర్లు రావడం ఆలస్యం కావడంతో జైలు నుండి పోసాని కృష్ణ మురళి విడుదల కాలేకపోయారు.. రేపు విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు పోసాని కృష్ణమురళి తరఫు న్యాయవాదులు.. మరోవైపు, బెయిల్ వచ్చినా పోసాని కృష్ణమురళి విడుదల అయ్యే వరకు అనుమానమే అంటున్నారు పోసాని సన్నిహితులు..
ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అర్హత నిర్ధారణ పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖ రాశారు.. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అర్హత నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలన్నారు.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కు అనుగుణంగా రాష్ట్రంలో కుడా నిర్ణయం తీసుకోవాలని సీఎంను లేఖలో కోరారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం రోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. కర్నూలు జిల్లా పర్యటనకు రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. తిరిగి హైదరాబాద్కు చేరుకోవడంతో పవన్ కల్యాణ్ పర్యటన ముగియనుంది..
పోసానికి ఊరట లభించింది.. ఇవాళ లేదా రేపు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది.. ఇవాళ సీఐడీ కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజురు చేసింది గుంటూరు కోర్టు.. దీంతో, ఆయనకు బిగ్ రిలీఫ్ దక్కినట్టు అయ్యింది..