మంత్రి నారా లోకేష్ కనిగిరి నియోజకవర్గంలో పర్యటించారు. సీబీజీ ప్లాంట్ కు భూమి పూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతు.. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది పౌరుషం, ప్రేమ.. 019లో ఎదురు గాలి ఉన్నా నాలుగు సీట్లు గెలిపించారు.. 2024లో 10 సీట్ల లో గెలిపించారు. ప్రకాశం జిల్లాని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తాం.. అమరావతి రాజధానిగా అందరి ఆమోదంతో ప్రకటించాం.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది.. వాటాలు ఇవ్వలేదని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తరిమేశారని మండిపడ్డారు.
Also Read:Niharika : మరో సినిమా నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల.. హీరోగా సంగీత్ శోభన్
గత ఐదేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టు గురించి చెప్పమని పులివెందుల ఎమ్మెల్యే కి సవాల్ చేశాను.. కానీ పులివెందుల ఎమ్మెల్యే నుండి సౌండ్ లేదు.. ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాము. మా బ్రాండ్ సిబిఎన్.. ఎన్నికల్లో సైకో పాలనకి బైబై చెప్పారు.. రాష్ట్రానికి అనేక కంపెనీ రాబోతున్నాయి.. రిలయన్స్ ఫౌండేషన్ ధీరుబాయి అంబానీ, సీఎం చంద్రబాబు కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. ఏపీ అంటే స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని చూపిస్తాం.. కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ లు ఏపీలో పెట్టేందుకు రిలయన్స్ ముందుకు వచ్చిందని తెలిపారు.
Also Read:Divya Bharathi : నేను ఎవరితో డేటింగ్‌లో లేను.. కుండ బద్దలు కొట్టిన హీరోయిన్
మొదటి ప్లాంట్ నిర్మాణం కనిగిరిలో చేస్తున్నాం.. ఈ పెట్టుబడుల ద్వారా ఏపీలో 2.50లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. కనిగిరిలో యువగళంలో ఇచ్చిన మొదటి హామీని నిలబెట్టుకున్నాను. సిబిజి ప్లాంట్ వలన రైతులకు మేలు జరుగుతుంది.. ప్రకాశం జిల్లా ఎప్పుడు వచ్చినా నా పాదయాత్ర గుర్తొస్తుంది. అందరూ నా చేతులు గీరారు… కొంత మంది కొరికారు. కనిగిరిలో రైల్వే ప్రాజెక్టు కోసం కృషి చేస్తాం.. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
Also Read:HMD 130 Music, HMD 150 Music: యూపీఐ సపోర్ట్ తో.. HMD నుంచి రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లు విడుదల
పవన్ కళ్యాణ్ ఏమనుకున్నా సాధించే వ్యక్తి.. పవన్ కళ్యాణ్ నాకు అన్న.. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులు దుర్వినియోగం చేశారు.. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మళ్లీ నిధులు తీసుకువచ్చారు.. వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తుంది.. వాళ్లు పని చేయరు.. ఇంకొకరిని పని చేయనివ్వరు.. సిబిజి ప్లాంట్ కి వైసీపీ నాయకులు అడ్డుపడొద్దు.. అడ్డుపడే వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లోకి ఎక్కుతాయి.. సైకో పాలనకి తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని ఆనాడే చెప్పా.. 94 శాతం సీట్లలో ఎన్డీఏ కూటమిని గెలిపించారు.. త్వరలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేస్తామని లోకేష్ వెల్లడించారు.