శ్రీశైలంలో ఈనెల 27వ తేదీ నుండి 31వ తేదీ వరకు అంటే ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు పాదయాత్రగా వచ్చే కైలాశద్వారం వద్ద భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు పరిశీలించారు ఈవో శ్రీనివాసరావు.. కన్నడ భక్తులు సేదతిరే చలువ పందిళ్లు, స్వచ్ఛసేవ, అన్నదానలను పరిశీలించారు ఈవో.. మంచినీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ద పెట్టి.. పాదయాత్ర కన్నడ భక్తులకు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు..
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖపట్నం అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ప్రజల అభిప్రాయం తర్వాత మాత్రమే వైజాగ్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతుందన్నారు మంత్రి నారాయణ.. గత ప్రభుత్వం స్వార్ధ పూరితంగా ఆలోచించి వైజాగ్ మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని విమర్శించారు.. వైజాగ్ మాస్టర్ ప్లాన్.. అభివృద్ధి, భూ సమస్యలుపై విశాఖ ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.
వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. విచారణ వాయిదా పడుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఈ రోజు పెద్ద ట్విస్ట్ వచ్చి చేరింది.. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దని.. వంశీతో తనకి ప్రాణహాని ఉందంటూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సత్యవర్ధన్.. దీంతో, ఈ…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆలయ అధికారులు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులతో ఆక్టోపస్ నిర్వహించారు. దుర్గగుడిపై పటిష్ట చర్యలు తీసుకోవాలని ఈ నెల19,20 తారీకుల్లో దుర్గగుడిపై ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భద్రతా చర్యలపై ఆక్టోపస్ టీమ్ వేలెత్తిచూపింది. లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అటు భక్తులకు గాని, ఇటు సిబ్బందిని గాని హెచ్చరించడానికి సైరాన్ సౌకర్యం లేదని గుర్తించింది. ఆలయంలోకి…
రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మానవతప్పిదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read:IPL 2025…
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక, ఉద్యోగుల బకాయిల చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Off The Record: అక్కడ వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా తయారైందా? మూడు నియోజకవర్గాల్లో అయితే... అసలు ఫ్యాన్ స్విచ్చేసే దిక్కే లేకుండా పోయిందా? పరిస్థితుల్ని అనుకూలంగా మల్చుకునే అవకాశం వచ్చినా లోకల్ లీడర్స్ పట్టించుకోవడం లేదా? చెయ్యాల్సిన చోట పని చేయకుండా పక్క నియోజకవర్గాల్లో పెత్తనాలు ఎక్కువయ్యాయా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎందుకంత దారుణంగా మారింది?.
Off The Record: కూటమిలో ఇక కాపు తమ్ముళ్ళకు ప్రమోషన్లు ఉండవా? సైకిల్ పార్టీ కాపు నాయకులంతా త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా? చేతికాడికొచ్చిన పదవుల్ని వాళ్ళొచ్చి తన్నుకుపోతున్నారంటూ... టీడీపీ కాపులు తెగ ఫీలైపోతున్నారా? ఇంతకీ వాళ్ళ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నదెవరు? ఎందుకు పసుపు కాపుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది?.
Off The Record: పదిహేనేళ్ళ పాటు బద్ద శత్రువుల్లా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఇప్పుడు మందు, సోడాలా మిక్స్ అయిపోయారట. జానీ వాకర్ మీద ఒట్టేసి చెబుతున్నాం... ఇక మాది దోస్త్ మేరా దోస్త్ బంధం అంటున్నారట. అస్సలు జీవితంలో ఊహించని ఈ పరిణామంతో విశాఖ జనం ఉక్కిరి బిక్కిరి అయిపోయి, అమ్మనీ.... అంతా లిక్కర్ డ్రాప్స్ మహిమ అంటున్నారట.