Kakani Govardhan Reddy: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుపై సందిగ్ధం నెలకొంది. నిన్న (బుధవారం) మరోసారి హైదరాబాద్ లో కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈరోజు నెల్లూరుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు.
Read Also: AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. పలు అంశాలపై చర్చ
ఇక, నేడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ మరియు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తెల్లరాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని కాకాణిపై పొదులుకూరి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదు అయినా కేసులను కొట్టివేయాలని కాకాణి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. నేటికి విచారణను వాయిదా వేసింది హైకోర్టు.