వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..
READ MORE: Dog Video: రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా పట్టాలపై పడ్డ డాగ్.. చివరికిలా..!
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అనుగుణంగా తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, జార్ఖండ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో జరుగుతున్న హింసకాండను వెంటనే ఆపాలని, అక్కడున్న సాయిధ బలగాలను నిలవరించాలని, ఈ ప్రతిపాదనలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటే తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా ఈ సమయంలో తాము కాల్పుల విరమణ కూడా ప్రకటిస్తామని వెల్లడించింది.. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో శాంతి చర్చకు సంబంధించి మేధావులు మానవ హక్కుల సంఘాలు పలువురు నేతలు జరిపిన సమావేశానికి స్పందిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ మేరకు లేఖను విడుదల చేసింది.
READ MORE: Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ నుండి మూడో పాటకి డేట్ లాక్ ?
కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దేశంలో ఎక్కడ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నా వరంగల్ ప్రాంతానికి చెందిన కీలక నేతల ప్రస్తావన వస్తోంది. ఎక్కడ పోలీసుల తూటా పేలినా ఇక్కడి వారు మృత్యువాత పడుతున్నారు. వారి కుటుంబాలకు కన్నీరు మిగిలిస్తోంది. గత మూడు నెలల కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్లలతో వంద మందికిపైగా నేలకొరిగారు. గతేడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో 287 మంది మృత్యువాతపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో ఇక్కడి వారు చనిపోతుండడంతో జిల్లాలోని మావోయిస్టు నేతల కుటుంబ సభ్యులు, బంధువుల్లో వణకు పుడుతోంది. ఎప్పుడూ ఎలాంటి సమాచారం వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.