పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత సీఎం చంద్రబాబు దే అన్నారు. కల్చరల్స్ చూస్తూ నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమా గుర్తొచ్చింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబు లాంటి బలమైన నాయకుడిని కడుపుబ్బ నవ్వేలా చేసారు అని పేర్కొన్నారు.
AP Deputy Speaker: విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లెజిస్లేచర్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు దుర్యోధనుడి వేషధారణలో నటించి అదరగొట్టారు.
Marri Rajasekhar: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు దేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు.
Transgender Murder Case: అనకాపల్లిలో ట్రాన్స్ జెండర్ దీపు (దిలీప్ కుమార్) హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి చెందిన నిందితుడు బండి దుర్గా ప్రసాద్ (బన్నీ)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Botsa Satyanarayana: సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ, ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని ఆరోపించారు.
CM Chandrababu: ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆ మాట త్వరలో నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పా.. జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంది.
అనంతపురం నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ క్లియర్ కట్ మెజార్టీతో పీఠంపై ఉంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 48 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వారిద్దరు కూడా వైసీపీకి మద్దతు పలికారు. అయితే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వసీం సలీంని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. అది అప్పట్లో చాలామందికి నచ్చలేదు. పైగా అనంత వెంకటరామిరెడ్డికి మేయర్ వసీంకి వ్యతిరేకంగా కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు.