AP Cabinet Meeting: ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధనాంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది ఏపీ కేబినెట్. ఇక, రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోదం ముద్ర వేసే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కేబినెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నాలా చట్టం రద్దుకు సంబంధించి కేబినెట్ లో తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. పథకాలపై కూడా చర్చ జరగనుంది. అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.