YS Jagan: మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి.. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెడతాడు. సమాజంలో ఉన్న 20 శాతం పేదవాళ్ల బాగోగులకు 10 శాతం మందికి అప్పగిస్తాడంట? రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48 కోట్ల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఆదాయ పన్ను కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా? ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు.. కానీ, కావాలనే మోసం చేస్తాడు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Waqf Bill: దేశవ్యాప్తం ఉద్యమం చేస్తాం.. వక్ఫ్ బిల్లుపై ముస్లిం పర్సనల్ లాబోర్డ్ వార్నింగ్..
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు అని మండిపడ్డారు జగన్.. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు.. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వంకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.. ఇక, మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని.. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను అన్నారు. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్.. మరో 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైయస్సార్‌సీపీ గెలిచింది.. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు… వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ, భయాందోళనల మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు అని హాట్ కామెంట్లు చేశారు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ, అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజం ఇది ధర్మమేనా? న్యాయమేనా? అని ప్రశ్నించారు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోంది. ఈ 11 నెలల కాలంలో ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. 143 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు..
Read Also: Shreyas Iyer Record: ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!
వైయస్సార్‌సీపీ పాలనలో ఏదో ఒక బటన్ నొక్కేవాళ్లం.. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది అన్నారు జగన్.. ఇప్పుడు ప్రజల్లోకి కార్యకర్తలను పంపే పరిస్థితి చంద్రబాబుకు లేదు. తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. 40 వ వార్డు కార్పొరేటర్ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్‌సీపీవే. కానీ అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై.. ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. 9 మంది వైయస్సార్‌సీపీతోనే ఉన్నారు. వారిని ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్ చేయించుకున్నారని ఆరోపించారు..
Read Also: Shreyas Iyer Record: ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!
రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే.. ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు అని మండిపడ్డారు జగన్.. ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవి.. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైయస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను అని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..