Salman Ali Agha: “ఈ బలహీనతే మా కొంప ముంచింది”.. పాక్ కెప్టెన్ సంచలన స్టేట్‌మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Ali Agha: పాకిస్థాన్ టీ20 టోర్నీకి ముందు ఎంత రచ్చ చేసిందో పెద్దగా చెప్పనవసరం లేదు. తామే కప్పు గెలుస్తామన్న రీతిలో బిల్డప్ కొట్టింది. ఐసీసీ, శ్రీలంక క్రికెట్ టీమ్ పాక్‌తో మాట్లాడి కన్వీన్స్ చేసి మరీ టోర్నీలోకి అడుగు పెట్టేలా, భారత్‌పై పాక్ మ్యాచ్‌లు జరిగేలా చేశారు. తీరా చూస్తే శ్రీలంక పాకిస్థాన్ చావు దెబ్బ కొట్టింది. తాము ఇంటికి పోతూ.. పాకిస్థాన్‌ను సైతం వెంట తీసుకెళ్లింది. నిన్నటి మ్యాచ్‌పై కెప్టెన్ సల్మాన్ అఘా స్పందించాడు. తమ జట్టు వైఫల్యాలను స్పష్టంగా అంగీకరించాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ సమస్యే తమ కొంప ముంచిందని ఒప్పుకున్నాడు. “టోర్నమెంట్ మొత్తం మన బ్యాటింగ్ సరిగా పనిచేయలేదు. సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు సరైన మద్దతు లభించి ఉంటే కథ వేరుగా ఉండేది. మిడిల్ ఆర్డర్ సమస్య ఎన్నాళ్లుగానో ఉంది. దాన్ని సమీక్షించాల్సిందే. 18 ఓవర్లు బాగా ఆడాం. చివరి రెండు ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. 160 కూడా కాపాడటం కష్టమే అయ్యేదేమో! మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సాహిబ్‌జాదా ఫర్హాన్ తన శతకం జట్టుకు ఉపయోగపడకపోవడం బాధ కలిగించింది. జట్టుకోసం బాగా ఆడాలనుకున్నా. ఫఖర్ సైతం శతకం చేయాలని ఆశపడ్డా. నా శతకం జట్టును సెమీఫైనల్‌కు తీసుకెళ్లలేకపోయింది.. అందుకే బాధగా ఉంది” అని అఘా స్పష్టం చేశాడు.
READ MORE: Pakistan: ఇరాన్ మంటల్లో కాలిపోతున్న లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ..
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్ సెమీస్‌కు చేరాలంటే శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయాల్సి ఉండేది. న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్‌లో దాటాల్సి ఉండేది. కానీ.. శ్రీలంక జట్టు ఏ మాత్రం తగ్గలేదు. చివరి వరకు పోరాడి ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగుల చేసింది. శ్రీలంక పోరాడి ఓడింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ రెండూ జట్లు మూడు పాయింట్లతో సమానంగా ఉన్నా, మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా న్యూజిలాండ్ రెండో స్థానంతో సెమీఫైనల్ చేరింది. గ్రూప్‌లోని మరో జట్టు ఇంగ్లాండ్ ఇప్పటికే మూడు విజయాలతో అర్హత సాధించింది. ఇక శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక శివతాండవం చేశాడు. కేవలం 31 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసి మ్యాచ్‌ను చివరి క్షణాల వరకూ తీసుకెళ్లాడు. మొత్తంగా, ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు ఆలస్యంగా వచ్చిన పాఠంలా మారింది. విజయం సాధించినా లక్ష్యం చేరుకోలేకపోవడం జట్టు లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. ఇక ముందు మార్పులు తప్పవన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
READ MORE: Ayatollah Arafi: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అరాఫీ నియామకం..
తాజావార్తలు
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..