Pastor Praveen: హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివిధ కోణాల్లో పూర్తిస్థాయి నివేదికలతో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు రేపు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
టీడీపీ - జనసేన - బీజేపీ ఒకే ఆలోచనతో ఉన్నాయి.. అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ రోజు శాసన మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు..
పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి ఇళ్ల స్థలాల కోసం ఇస్తామని తెలిపారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పని చేస్తున్నారని తెలిపారు.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ తవ్వకాలు.. ఖనిజం రవాణా.. పేలుడు పదార్థాల నిల్వకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మూడో సారి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్స్ ఇచ్చారు. దీంతో రాజధాని ప్రాంతానికి కీలక జాతీయ రహదారి అందుబాటులోకి రావడమే కాకుండా, అక్కడి నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ను సులువుగా తరలించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది.
Bird Flu Death in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి బర్డ్ ఫ్లూ మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్ తో మృతి చెందింది. పచ్చి కోడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకి మరణించిందని ఎయిమ్స్ వైద్యులు ధృవీకరించారు.
Visakhapatnam: విశాఖపట్నంలో స్కూల్ విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లల ప్రాణాలని మద్యానికి పణంగా పెట్టాడు ఆటో డ్రైవర్.. మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 44 బార్లను ఈ-వేలం, ఆన్ లైన్ లాటరీ పద్ధతిలో ప్రభుత్వం కేటాయించనుంది. రాష్ట్రంలో లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లు ఈ-వేలం ద్వారా కేటాయింపులు జరపనున్నారు.
Minister Lokesh: ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో 375 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీతో కలిసి లోకేశ్ పాల్గొననున్నారు.
YS Jagan: ఇవాళ తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.