CPI Narayana: టీటీడీకి చెందిన ఎస్వీ గోశాలలలో వందలాది గోవులు మృతిచెందాయంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై దుమారం రేగింది.. అలాంటి ఏమీ లేదంటూ.. అదంతా తప్పుడు ప్రచారమేనంటూ టీటీడీ కొట్టిపారేసింది.. అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన.. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టిటిడి గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు, గోవులకు కావాల్సినంత దాణా ఉందని వెల్లడించారు.. ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.. గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.
Read Also: AR Rahman : నా వర్కింగ్ స్టైల్ గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు..
ఇక, టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.. హరినాథరెడ్డిని సస్పెండ్ చేయడం కాదు విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు సీపీఐ నారాయణ.. గతంలో గోవులకు పురుగుల దాణా పెట్టడం దారుణం అన్నారు.. కమీషన్ల కోసం హరినాథరెడ్డి గోవులను విక్రయించారు.. టీటీడీ టైం స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి హరినాథరెడ్డి కమీషన్లు తీసుకునేవారు అంటూ ఆరోపణలు గుప్పించారు.. మరోవైపు.. తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టిక్కెట్లను అందిస్తుండడం శుభపరిణామంగా పేర్కొన్నారు నారాయణ.. గత మూడు నెలలుగా శ్రీవాణి టిక్కెట్ల సంఖ్యను పెంచడాన్ని స్వాగతిస్తున్నాను అన్నారు.. అయితే, గోశాలను వైసీపీ రాజకీయలబ్ధి కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు, టీటీడీని అప్రతిష్టపాలు చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..