Gudivada Amarnath: జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నాం.. ఈ నెల 19వ తేదీన జరిగే అవిశ్వాస తీర్మానంలో ఎవరు పాల్గొనకూడదని వెల్లడించారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయేoదుకు సరిపడ బలం మాకు ఉంది.. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి అని వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు.
Read Also: Minister Narayana: అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారు..
ఇక, విశాఖ మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ.. మహిళల మీద గౌరవంతో వైఎస్ జగన్ మేయర్ గా నాకు అవకాశం కల్పించారు.. బీసీ జనరల్ అయినా సరే యాదవ మహిళకు మేయర్ గా అవకాశం ఇచ్చారు.. యాదవులకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారని పేర్కొన్నారు. యాదవుల కోరిక మేరకు భవన నిర్మాణం కోసం 50 సెంట్లు స్థలాన్ని కేటాయించారు.. కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు.. కుట్ర కుతంత్రాలతో యాదవ వర్గానికి చెందిన మహిళను పదవి నుంచి దించేయాలని చూడడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించింది. యాదవుల కన్నీరు మంచిది కాదంటూ గతంలో ఎమ్మెల్యే వంశీ చెప్పారు.. ఇప్పుడు యాదవుల కన్నీరు వంశీకి కనిపించడం లేదా అని క్వశ్చన్ చేసింది. సోదర సమానులైన పల్లా శ్రీనివాస్, వంశీ అవిశ్వాసాన్ని ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసం అపి హరి వెంకట కుమారి పేర్కొన్నారు.