Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారు అని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు. అమరావతికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల భూముల విలువ పెరగాలంటే పరిశ్రమలు రావాలి అని తేల్చి చెప్పారు. కంపెనీలు రావాలంటే అదనపు భూమి అవసరం అని చెప్పుకొచ్చారు. ఇక, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన వాటి విలువ పెరగడం కోసం మరికొంత భూమి అవసరం ఇవ్వాల్సి ఉందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
Read Also: Haryana: భార్య చేతిలో మరో భర్త బలి.. యూట్యూబర్ సాయంతో..!
ఇక, భూ సేకరణ జరిగితే రైతులు నష్టపోతారు అని నారాయణ తెలిపారు. దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం.. అలాగే, భూములు ఇచ్చిన వారి ల్యాండ్ రేట్ పడిపోతుందని ఒక సందేహం రైతులకు ఇవ్వొద్దు.. ఒక ఏడాది లోపే ఉద్యోగుల భవనాలు, ట్రంక్ రోడ్లు పూర్తి అవుతాయని తేల్చి చెప్పారు. అమరావతిలో విమానాశ్రయం రావాలి.. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు.