CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, వడ్డీలపై 16వ ఆర్ధిక సంఘానికి వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి రాజధానిపై స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చిన నష్టం.. కేంద్ర సాయంపై ప్రధానంగా సీఎం చంద్రబాబు వివరించారు… ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు.. గ్రామీణాభివృద్ధి.. పంచాయితీ రాజ్.. మున్సిపల్ శాఖలకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సిఫార్సు చేయాల్సిందిగా కోరారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Trivikram : 300కోట్ల హీరోతో త్రివిక్రమ్ సినిమా.. ఇంకా చాలా ఉందట!
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేస్తోన్న సాయంతో కొంతముందుకు వెళుతున్నా.. గతంలో చేసిన అప్పులు, వాటికి అవుతున్న వడ్డీలతో ప్రగతి రథం ముందుకు కదలడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం అధికారులకు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. ఇక, సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు లాంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్- 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు సీఎం చంద్రబాబు వివరించారు.. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాలను వివరించారు. గత ఐదేళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు సీఎం చంద్రబాబు నాయుడు..