Farmer Suicide: అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారుల తీరుతో విసిగు చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి నుంచి సంక్రమించిన మిలిటరీ పట్టా భూమిని రెవెన్యూ అధికారులు ఆన్లైన్ లోకి ఎక్కించాలని పలుమార్లు కోరిన పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన రైతు వెంకటాద్రి సూసైడ్ చేసుకున్నాడు.
Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కుమార్తె పై కన్నతల్లి కేసు పెట్టేందుకు సిద్ధమవటం దానికి పోలీసులు సహకరించి వేధింపులకు దిగడంతో మౌనిక అనే యువతి విజయవాడలో సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.
Kakani Govardhan Reddy: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుపై సందిగ్ధం నెలకొంది. నిన్న (బుధవారం) మరోసారి హైదరాబాద్ లో కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు
AP Cabinet Meeting: ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధనాంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
మంత్రి నారా లోకేష్ కనిగిరి నియోజకవర్గంలో పర్యటించారు. సీబీజీ ప్లాంట్ కు భూమి పూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతు.. ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది పౌరుషం, ప్రేమ.. 019లో ఎదురు గాలి ఉన్నా నాలుగు సీట్లు గెలిపించారు.. 2024లో 10 సీట్ల లో గెలిపించారు. ప్రకాశం జిల్లాని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తాం.. అమరావతి రాజధానిగా అందరి ఆమోదంతో ప్రకటించాం.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది.. వాటాలు ఇవ్వలేదని రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు…
వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. చంద్రబాబు, లోకేష్ కుటుంబాలను బంగారుమయం చేసుకుంటారేమో.. కానీ, పేద ప్రజలకు చేసేదేమీ లేదన్నారు.. చంద్రబాబు మీటింగులకు వచ్చిన జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.. ఇక, పవన్ కల్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నారో అర్ధం కావటం లేదు అని ఎద్దేవా చేశారు.
సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి.. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెడతాడు. సమాజంలో ఉన్న 20 శాతం పేదవాళ్ల బాగోగులకు 10 శాతం మందికి అప్పగిస్తాడంట? రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?