TDP: ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.. “ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..” అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేసిన ట్వీట్ విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయ్యింది.. అయితే, గంటా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. విమాన సర్వీసులు జాప్యంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి.. లేకపోతే విమానయాన శాఖ మంత్రి కూడా మనవారే కదా..? కేంద్ర మంత్రి రామ్మోహన్ కి ఫోన్ చేయొచ్చు కదా..? అని గంటను ప్రశ్నించింది టీడీపీ అధిష్టానం.. అంతేకాదు, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని గంటను హెచ్చరించింది అధిష్టానం..
Read Also: Tollywood : హిట్ కొడితే హీరో.. ప్లాప్ అయితే డైరెక్టర్.. టాలీవుడ్ తీరే వేరు
కాగా, ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ.. అంటూ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు గంటా శ్రీనివాసరావు.. “ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది.. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారని పేర్కొన్నారు.. విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.” అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేయడంతో వైరల్‌గా మారిపోయింది.. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది..
ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి… pic.twitter.com/kDMWFyjs9I— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) April 15, 2025