ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. వారసత్వంగా నాకు అప్పు వచ్చింది.. రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తా అన్నారు..
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఈ రోజు కూడా పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు.. అయితే, పోలీసులకు మాత్రం సమాచారం ఇచ్చారట కాకాణి.. రేపు రాత్రికి నెల్లూరు చేరుకోనున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. గురువారం నుంచి తాను అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం చేరవేశారట.. రేపు కుటుంబ శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని తెలిపారట.
నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపాలిటీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఆసక్తికర చర్చ మొదలైంది.
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో గత రెండు రోజుల క్రితం హత్యకు గురైన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్ది పరామర్శించారు.
Elamanchili: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన రాజకీయం కీలక మలుపు తిరిగింది. చైర్ పర్సన్ రమా కుమారిపై ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకునేందుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు.
Visakha Mayor: గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది.
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణీ గోవర్థన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈరోజు (ఏప్రిల్ 1న) నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు.
Pension Distribution: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. ఇక, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజక వర్గంలోని కొత్త గొల్లపాలెం, పెద్ద గంజాంలో పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.