టొమాటోలో ఎ, బి, సితో పాటు కె విటమిన్లు ఉన్నాయి. ఇవి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

బొప్పాయి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆకస్మిక గుండెపోటును నివారించాలంటే పచ్చి బొప్పాయి రోజూ తినాలి.

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బొప్పాయిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఎక్కువుగానే ఉంటాయి.

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి అవకాడోను సమృద్ధిగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈపండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

అవకాడో గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక మీడియం సైజ్ అవోకాడోలో 96 కేలరీలు, 6 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు, 4 గ్రాముల ఫైబర్ ఉంటాయని నిపుణుల అంచనా.

సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లు సిట్రస్ పండ్ల జాబితాలోకి వస్తాయి. వీటిలో Vitamin-C పుష్కలంగా ఉంటుంది.

పుచ్చకాయ ఒక రిఫ్రెషింగ్ పండు. డైటీషియన్ల గైడెన్స్ ప్రకారం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఈపండు సహాయపడుతుంది.

పుచ్చకాయలో లైకోపీన్, కెరోటినాయిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తుంది, తద్వారా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.