AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తుది దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు తుది దశ చేరుకుంటున్నాయి.. ఇప్పటికే రెండు దశలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కాగా.. తొలి దశలో విత్‌డ్రాలు కూడా ముగిసిన తుది జాబితా ప్రకటించారు.. రెండో దశలో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది.. ఇక, తుది దశకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. ఎల్లుండి నుంచి తుది దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు కల్పించారు.
ఈ నెల 24వ తేదీన ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) నిర్వహించనున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలు, అప్పీళ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను ఈ నెల 26వ తేదీన పరిష్కరించనున్నారు. అనంతరం అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
Also Read
- AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
- Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
- SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
- AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
ఇక డిసెంబర్ 2వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఏదైనా కారణంతో రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడితే డిసెంబర్ 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల తుది దశకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించనున్నారు..
తాజావార్తలు
-
NZ vs IND 1st Test: నికోల్స్ సెంచరీ, ఫిలిప్స్ విధ్వంసం.. 70కే 5 వికెట్స్ కోల్పోయినా కివీస్‌దే పైచేయి!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తుది దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
-
Marriages: “పెళ్లి వద్దు.. సింగిల్ లైఫే బెటర్”.. యువత పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటోంది? 4 ప్రధాన కారణాలివే..
-
Trump-Putin-Xi Jinping Meeting: యాల్టా 2.0 అంటే ఏమిటి? ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ సమావేశం వెనుక అసలు కథ ఇదే!
-
World Cup Final 2023: నవంబర్ 19.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని చేదు జ్ఞాపకం..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!