Chandrayaan Review : ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ తదితరులు
- DIRECTOR: శ్రీనాథ్ చంద్రశేఖర్
- MUSIC:
- PRODUCER: వేణు ఉడుగుల, ప్రవీణ్ మొలక
సహజమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఊడుగుల (‘నీది నాది ఒకే కథ’, ‘విరాటపర్వం’ ఫేమ్) సమర్పణలో వచ్చిన తాజా చిత్రం ‘చంద్రయాన్’. సింబా స్క్రీన్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రవీణ్ మొలక నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని హీరో హీరోయిన్లుగా నటించగా.. రవి శివతేజ, వంశీధర్, లోకేష్, ‘బలగం’ సత్యనారాయణ కీలక పాత్రల్లో కనిపించారు. మరి మందమర్రి కుర్రాళ్లు చేసిన ఈ అంతరిక్ష ప్రయోగం థియేటర్లలో ఏ మేరకు నవ్వులు పూయించిందో చూద్దాం.
కథ
Also Read
ఈ కథంతా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి అనే సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరికి చెందిన శివ, రవి, రాజు, చిన్నా అనే నలుగురు ప్రాణ స్నేహితులు. వీరికి చదువు పెద్దగా వంటబట్టదు కానీ, ఊళ్లో పనిపాటా లేకుండా తిరుగుతూ ఉంటారు. ఈ గ్యాంగ్‌లో ఒకడు ప్రతి చిన్న విషయానికీ ముహూర్తాలు చూస్తుంటే, ఇంకొకడు ఏ పని చేయాలన్నా గూగుల్ తల్లిని నమ్ముకుంటాడు. వీళ్ల పనులతో విసిగిపోయిన ఊరి జనం వీరికి ‘శని సంఘం’ అని పేరు పెడతారు.
అయితే, ఊళ్లో అందరితో తిట్లు తినే శివ.. అదే గ్రామానికి చెందిన బిందు అనే అమ్మాయిని ఇష్టపడతాడు. తన మీద ఉన్న జులాయి ముద్రను చెరిపేసుకుని, ప్రేమించిన అమ్మాయి దృష్టిలో హీరో అవ్వాలని శివ తపిస్తుంటాడు. ఇందుకోసం ఎవరూ ఊహించని విధంగా సొంతంగా ఒక రాకెట్ తయారు చేసి, ఏకంగా చంద్రుడి మీదికి వెళ్లాలని తన మిత్రబృందంతో కలిసి డిసైడ్ అవుతాడు. అసలు సైన్స్ అంటేనే తెలియని ఈ పల్లెటూరి కుర్రాళ్లు రాకెట్ ఎలా తయారు చేశారు? వీళ్ల వింత ప్రయోగం ఊళ్లో ఎలాంటి అలజడి సృష్టించింది? చివరికి శివ తన ప్రేమను, లక్ష్యాన్ని గెలుచుకున్నాడా? అనేదే ‘చంద్రయాన్’ అసలు కథ.
విశ్లేషణ
ఒక మారుమూల పల్లెటూరి కుర్రాళ్లు ఏకంగా చంద్రుడిపైకి వెళ్లాలనుకోవడం అనే పాయింట్ వినడానికి చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను మందమర్రి లాంటి పూర్తి గ్రామీణ నేపథ్యంలో సెట్ చేయడం దర్శకుడి ఆలోచనకు ఉన్న ప్లస్ పాయింట్. అయితే, పేపర్ మీద ఉన్న ఈ క్రేజీ ఐడియాను రెండు గంటల పాటు ఆసక్తికరంగా నడిపించడంలో మాత్రం తడబాటు కనిపించింది. సినిమా ఫస్టాఫ్ అంతా నలుగురు మిత్రుల క్యారెక్టరైజేషన్లు, ఊళ్లో వాళ్లు చేసే అల్లరి, పక్కా తెలంగాణ యాసలో సాగే సంభాషణలతో సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా రాకెట్ తయారీ కోసం వీళ్లు పడే పాట్లు, ఆ క్రమంలో పుట్టే అమాయకపు కామెడీ అక్కడక్కడా బాగానే నవ్విస్తాయి. పల్లెటూరి వాతావరణం, స్నేహితుల మధ్య ఉండే సహజమైన బాండింగ్ తెరపై బాగా కుదిరాయి. నిఖిల్, రావు రమేష్, ఆదిత్య మీనన్ లాంటి వారి గొంతులు తోడవ్వడం సినిమాకు ఒక గ్రాండియర్ ఫీల్‌ను ఇచ్చింది.
కానీ అసలు కథ మొదలయ్యే సెకండాఫ్‌కు వచ్చేసరికి స్క్రీన్‌ప్లే పూర్తిగా నెమ్మదిస్తుంది. రాకెట్ ప్రయోగం చుట్టూ ఉత్కంఠను కానీ, హిలేరియస్ కామెడీని కానీ పండించాల్సిన చోట సన్నివేశాలను సాగదీసినట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్లు నవ్వించినప్పటికీ, బలమైన సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) లేకపోవడంతో కథ అక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. ఎమోషన్స్, వాళ్ల కలను నిజం చేసుకునే తపన కొంతవరకు కనెక్ట్ అయినా.. బలమైన కథనం లోపించడంతో సినిమా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే హీరోగా నటించిన శివకుమార్ దీకొండ పల్లెటూరి యువకుడి పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయాడు. తన బాడీ లాంగ్వేజ్, తెలంగాణ యాస ఆకట్టుకుంటాయి. హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. ఇక హీరో స్నేహితులుగా నటించిన రవి శివతేజ, వంశీధర్, లోకేష్ తమ కామెడీ టైమింగ్‌తో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. వాళ్ల అమాయకత్వం, గెటప్స్ అన్నీ మన పక్కంటి కుర్రాళ్లను చూస్తున్నట్లే ఉంటాయి. బలగం సత్యనారాయణతో పాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస బి పనితీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. మందమర్రి పరిసరాలను, పల్లెటూరి అందాలను చాలా సహజంగా, రియలిస్టిక్‌గా కెమెరాలో బంధించారు. హర్ష ప్రవీణ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథ మూడ్‌కు తగ్గట్టుగా పర్వాలేదనిపిస్తాయి. అయితే ఎడిటర్ పుల్లారావు దాసరి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో సాగదీతగా అనిపించే సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, కథనంపై మరింత కసరత్తు చేయాల్సింది. సింబా స్క్రీన్ స్టోరీస్ నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా డీసెంట్‌గా ఉన్నాయి.
మొత్తంగా చెప్పాలంటే ‘చంద్రయాన్’ ఓ మంచి ప్రయత్నం
తాజావార్తలు
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్‌తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?