Mayaledi Movie Review: మాయలేడి రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.75 / 5
- MAIN CAST: రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, తదితరులు
- DIRECTOR: ప్రశంకర్
- MUSIC: విశాల్ చంద్రశేఖర్
- PRODUCER: రాకేష్ వర్రే (క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్)
Mayaledi Movie Review: నిర్మాత కం యాక్టర్ రాకేష్ వర్రే చేసిన కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటించింది. “మాయలేడి” సినిమా ఈ నెల 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
మాయలేడి కథ:
క్రిష్ (రాకేష్ వర్రే) అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్, ఆత్మరక్షణ నేర్పించే కోచ్. ఆశ (మధుమిత సర్కార్) అనే అమ్మాయిని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తన మనసులోని మాటను ఆమెకు చెప్పాలనుకునే లోపే.. అచ్చం ఆశ లాగే కనిపించే రూప (మధుమిత సర్కార్) క్రిష్ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. అయితే క్రిష్ మాత్రం ఆమెనే ఆశ అనుకుని పొరబడి ప్రేమిస్తుంటాడు, ఆమెతో ప్రయాణం సాగిస్తాడు. కొన్నాళ్లకు తనతో ఉన్నది ఆశ కాదని, రూప అని క్రిష్‌కు అసలు నిజం తెలుస్తుంది. అదే సమయంలో ఆశకు ఉన్న ఓ పెద్ద ఆరోగ్య సమస్య గురించి కూడా బయటపడుతుంది. అసలు ఒకేలా ఉన్న ఆశ, రూపల మధ్య సంబంధం ఏంటి? ఆశకు ఉన్న ఆ సమస్య ఏమిటి? ఆశ అనుకుని రూపకు దగ్గరైన క్రిష్.. నిజం తెలిశాక ఏం చేశాడు? క్రిష్‌ను మనస్ఫూర్తిగా ఇష్టపడిన రూప పరిస్థితి ఏంటి? ఈ మొత్తం వ్యవహారంలో ఇంద్రజ పాత్ర పోషించిన కీలక భూమిక ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘మాయలేడి’ మిగతా కథ.
Also Read
విశ్లేషణ
ఒక ప్రేమకథకు కామెడీ, సస్పెన్స్, కాస్త ఎమోషన్ జోడించి దర్శకుడు ప్రశంకర్ ‘మాయలేడి’ కథను సిద్ధం చేసుకున్నారు. పేపర్ మీద ఈ పాయింట్ ఆసక్తికరంగానే ఉన్నా, దాన్ని తెరపైకి తీసుకొచ్చే క్రమంలో అన్ని ఎలిమెంట్స్‌ను సమానంగా బ్యాలెన్స్ చేయడంలో తడబడ్డారు. ముఖ్యంగా సినిమాకు ఆయువుపట్టుగా ఉండాల్సిన లవ్ అండ్ ఎమోషనల్ ట్రాక్ కంటే.. కామెడీ, ట్విస్టుల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో కథలో సహజత్వం లోపించిన ఫీలింగ్ కలుగుతుంది.
సినిమా ప్రారంభంలో ఎక్కడా సమయం వృథా చేయకుండా హీరో క్యారెక్టర్‌ను పరిచయం చేసి నేరుగా కథలోకి వెళ్లిపోయారు. ఆశ, రూపల కన్ఫ్యూజన్ డ్రామా మొదలయ్యే వరకు ఫస్టాఫ్ కాస్త రొటీన్‌గానే సాగుతుంది. కానీ ఎప్పుడైతే రూప క్యారెక్టర్ చేసే అల్లరి, దానికి తోడు కమెడియన్ సత్య ఎంట్రీ ఉంటుందో.. అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ మారుతుంది. సత్య పంచ్ డైలాగులు, కామెడీ ట్రాక్ ఫస్టాఫ్‌ను సరదాగా ముందుకు నడిపిస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ట్విస్ట్ సెకండాఫ్‌పై మంచి క్యూరియాసిటీని పెంచుతుంది.
అయితే సెకండాఫ్ మొదలయ్యాక ఆశ ఫ్లాష్‌బ్యాక్, ఆమెకున్న హెల్త్ ఇష్యూ రివీల్ అవ్వడంతో కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఆ సమస్య ఏంటనేది తెలిసిన తర్వాత వచ్చే సన్నివేశాలు రొటీన్‌గా, సగటు ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగడం మైనస్. కథనం కూడా అక్కడక్కడా నెమ్మదించడంతో మంచి ట్విస్టులు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేం. సెకండాఫ్‌లో కూడా సత్య కామెడీనే ప్రేక్షకులకు అసలైన రిలీఫ్. ఎమోషనల్ సీన్స్‌ను దర్శకుడు ఇంకాస్త లోతుగా, గుండెకు హత్తుకునేలా రాసుకుని ఉంటే సినిమా అవుట్‌పుట్ మరో స్థాయిలో ఉండేది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే రాకేష్ వర్రే క్రిష్ పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయారు. సెల్ఫ్ డిఫెన్స్ కోచ్‌గా ఆయన బాడీ లాంగ్వేజ్ బాగుంది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్‌లో తన మార్క్ చూపిస్తూనే, కన్ఫ్యూజన్లో పడే లవర్ బాయ్‌గా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు అసలైన పిల్లర్ హీరోయిన్ మధుమిత సర్కార్ అని చెప్పాలి. ఆశ, రూప అనే రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమె నటించిన తీరు బాగుంది. ఒక పాత్రలో అల్లరిగా, మరో పాత్రలో ఎమోషనల్‌గా వేరియేషన్స్ చూపిస్తూ సినిమా భారాన్ని తన భుజాలపై మోశారు. ఈ సినిమాను నిలబెట్టిన మరో ప్రధాన బలం సత్య. స్క్రీన్ మీద సత్య కనిపించినప్పుడల్లా థియేటర్లో నవ్వులు పూయించారు. ఆయన టైమింగ్, వన్ లైనర్ పంచ్‌లు రొటీన్ సీన్లను కూడా నిలబెట్టాయి. సీనియర్ నటి ఇంద్రజ, సురేష్ తమ అనుభవంతో కథకు తగ్గట్టుగా హుందాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు పెద్ద ప్లస్ అయింది. సస్పెన్స్, ట్విస్టులను ఎలివేట్ చేయడంలో ఆయన నేపథ్య సంగీతం బాగా పనిచేసింది. పాటలు వినడానికి పర్వాలేదనిపిస్తాయి. యెదు రాధాకృష్ణన్ విజువల్స్ నీట్‌గా, కలర్ఫుల్గా ఉన్నాయి. రవితేజ గురిజాల ఎడిటింగ్ ఓకే అనిపించినా, సెకండాఫ్‌లో సాగదీతగా అనిపించే కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా రిచ్‌గా, క్వాలిటీగా ఉన్నాయి. దర్శకుడు ప్రశంకర్ ఎంచుకున్న పాయింట్, రాసుకున్న ట్విస్టులు బాగున్నాయి. కామెడీని డీల్ చేసినంత బలంగా ఎమోషన్స్‌ను, కథన వేగాన్ని హ్యాండిల్ చేయలేకపోయారు.
ఫైనల్లీ.. ‘మాయలేడి’ కొన్ని మంచి ట్విస్టులు, సత్య మార్క్ నవ్వులతో సాగే రొమాంటిక్ థ్రిల్లర్.
తాజావార్తలు
-
Sonia Gandhi Book: బాబ్రీ తాళాలు తెరవడం వెనక రాజీవ్ గాంధీ వ్యూహం.. రామమందిర రాజకీయాలపై సోనియా కీలక విషయాలు..
-
Telangana El Nino Impact : ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!
-
Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?