DNK Donga Na Koduku Review: DNK దొంగ నా కొడుకు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.25 / 5
- MAIN CAST: Mouli Tanuj Prasanth, Sushmitha Shetty, Ali, Raghu Babu
- DIRECTOR: Sreenu Kambala
- MUSIC: Sinjith Yerramilli
- PRODUCER: Naveen Yerneni, Y. Ravi Shankar
నటీనటులు: మౌళి, సుష్మిత శెట్టి, బబ్లూ, అలీ, రజిత, గుండు సుదర్శన్, రఘుబాబు, భద్రం, సత్య, జయకృష్ణ తదితరులు
సంగీతం: సింజిత్ యెర్రమిల్లి
సినిమాటోగ్రఫీ: సూర్య బాలాజీ
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్)
దర్శకత్వం: శ్రీను కంబాల
’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై, ఆ తర్వాత వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో థియేటర్లలో సాలిడ్ హిట్ అందుకున్న కుర్రాడు మౌళి. తన సహజమైన టైమింగ్, అమాయకపు నటనతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. దాంతో మౌళి నుంచి వస్తున్న తరువాతి సినిమాపై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘దొంగ నా కొడుకు’ అనే క్యాచీ టైటిల్‌తో మొదలై, ఆపై ‘DNK’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్.. ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో, మౌళి ఖాతాలో మరో హిట్ పడిందో లేదో సమీక్షలో చూద్దాం.
Also Read
DNK దొంగ నా కొడుకు కథ
విశాఖపట్నానికి చెందిన ఈశ్వర్ (మౌళి) బీటెక్ మధ్యలోనే ఆపేసి, ఏ బాధ్యతా లేకుండా జులాయిగా తిరిగే కుర్రాడు. కష్టపడకుండా రాత్రికి రాత్రే లక్షలు సంపాదించాలనే అత్యాశతో ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసవుతాడు. సొంత ఇంట్లోనే చిన్న చిన్న దొంగతనాలు చేయడం, లోన్ యాప్స్‌లో అప్పులు చేయడంతో పాటు తన ప్రేయసి దీపు (సుష్మిత శెట్టి) బంగారు ఉంగరాలను కూడా తాకట్టు పెట్టి బెట్టింగ్‌లో తగలబెడతాడు.
ఈ విషయం దీపు తల్లిదండ్రులకు తెలిసి ఈశ్వర్ ఇంటికొచ్చి గొడవ చేయడంతో నలుగురిలో పరువు పోతుంది. ఇక ఈ అప్పుల ఊబి నుంచి బయటపడటానికి తన ఫ్రెండ్ బబ్లూతో కలిసి ఏకంగా ఒక జ్యువెలరీ షాప్‌లో భారీ దోపిడీకి స్కెచ్ వేస్తాడు. అయితే ఆ దొంగతనం ప్లాన్ ఈశ్వర్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? ఆ జ్యువెలరీ షాప్ రాబరీ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? ఈ గందరగోళం నుంచి ఈశ్వర్ బయటపడ్డాడా లేదా? అనేదే ‘DNK’ అసలు కథ.
విశ్లేషణ
మౌళి లాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరోతో సినిమా అంటే ప్రేక్షకులు లాజిక్కులు పక్కనపెట్టి రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవడానికి థియేటర్‌కి వస్తారు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు శ్రీను కంబాల ఎంచుకున్న బేసిక్ పాయింట్, హీరో క్యారెక్టరైజేషన్ సెటప్ వరకు బాగానే ఉన్నాయి. ఫస్టాఫ్ ఆరంభంలో డబ్బుల కోసం హీరో పడే పాట్లు, లోన్ యాప్ వేధింపులలో తల్లిదండ్రులను ఇరికించే సీన్లు, హీరోయిన్‌తో లవ్ ట్రాక్ అక్కడక్కడా బాగానే నవ్విస్తాయి. కానీ అసలు కథ జ్యువెలరీ షాప్ రాబరీ దగ్గరకు వచ్చాక స్క్రీన్‌ప్లే పూర్తిగా గాడి తప్పింది. బలమైన కథ లేకపోవడంతో కేవలం సిట్యుయేషనల్ కామెడీ, వరుస ట్విస్టులతో సినిమాను లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి క్రైమ్ కామెడీలో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేయాలి కానీ, ఇందులో మాత్రం లెక్కకు మించిన ట్విస్టులు పెట్టి కథనాన్ని ఒక పెద్ద గందరగోళంగా మార్చేశారు. ఒక దశ దాటాక అవి నవ్వించకపోగా సహనానికి పరీక్ష పెడతాయి. అలాగే స్క్రిప్ట్‌లో సరైన పట్టు లేకపోవడంతో చిన్న చిన్న సీన్లను కూడా రబ్బరులా సాగదీశారు. ఉదాహరణకు ఒక బ్యాగ్ మాయం చేసే సీన్ గానీ, బంగారం అమ్మే ఎపిసోడ్ గానీ అనవసరమైన ల్యాగ్‌తో విసుగు తెప్పిస్తాయి. దానికి తోడు సోషల్ మీడియాలో అరిగిపోయిన పాత మీమ్స్‌ని డైలాగులుగా వాడటం, నవ్వించడం కోసం శ్రుతిమించిన డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టడం మౌళి లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నటుడికి అస్సలు సెట్ అవ్వలేదు. సెకండాఫ్ మొత్తం సరైన దిశానిర్దేశం లేకుండా సాగుతూ కామెడీ కాస్తా గోలగా మారిపోయింది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే సినిమా ఫలితం ఎలా ఉన్నా మౌళి మాత్రం తన వంతుగా సినిమాను భుజాల మీద మోయడానికి గట్టిగానే కష్టపడ్డాడు. బేఫికర్‌గా తిరిగే కుర్రాడిగా తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. ఫ్రెండ్‌తో, లవర్‌తో వచ్చే సీన్లలో తన ఎనర్జీ కనిపిస్తుంది. అయితే ‘లిటిల్ హార్ట్స్’లో మౌళిలో కనిపించిన ఆ సహజమైన అమాయకత్వం ఈ క్యారెక్టర్లో మిస్ అవ్వడం వల్ల కామెడీ పూర్తిస్థాయిలో పండలేదు. హీరోయిన్ సుష్మిత శెట్టి తెరపై అందంగా కనిపించింది, అమాయకపు ప్రేయసి పాత్రలో తన పరిధి మేరకు పర్వాలేదనిపించింది. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరో ఫ్రెండ్‌గా నటించిన బబ్లూ గురించి. తన కామెడీ టైమింగ్‌తో చాలా చోట్ల సీన్లను నిలబెట్టాడు, తనకు మంచి భవిష్యత్తు ఉంది. తల్లిదండ్రులుగా అలీ, రజిత తమ అనుభవాన్ని చూపించారు. అలీ బాలయ్య డైలాగుల స్పూఫ్‌తో కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. గుండు సుదర్శన్, రఘుబాబు, భద్రం తమ పాత్రల్లో ఓకే అనిపించగా.. క్లైమాక్స్‌లో సత్య కనిపించేది కాసేపే అయినా పర్వాలేదు. జయకృష్ణ పాత్రకు ఇచ్చిన బిల్డప్‌కి, చివర్లో ఇచ్చిన ముగింపుకి అసలు పొంతన కుదరలేదు.
సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. పరిమిత లొకేషన్లలో తీసినప్పటికీ విజువల్స్ చాలా కలర్ఫుల్గా, నీట్‌గా కనిపించాయి. ‘లిటిల్ హార్ట్స్’కి చార్ట్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన సింజిత్ యెర్రమిల్లికి ఇందులో పాటల పరంగా పెద్దగా స్కోప్ దక్కలేదు కానీ, తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మాత్రం పేలవమైన సీన్లలో కూడా ఏదో ఒక ఊపు తీసుకురావడానికి బాగానే ట్రై చేశాడు. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కత్తెర వేయాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో సాగదీత సీన్లను ట్రిమ్ చేసి ఉంటే సినిమా కాస్త క్రిస్పీగా ఉండేది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా అయినా, కథకు తగ్గట్టుగా చాలా పరిమిత బడ్జెట్లోనే పూర్తి చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. దర్శకుడు శ్రీను కంబాల రాసుకున్న లైన్ బాగున్నా, దాన్ని ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేగా మలచడంలో, కామెడీని-క్రైమ్‌ని బ్యాలెన్స్ చేయడంలో తడబడ్డారు.
ఫైనల్లీ: ఈ ‘DNK (దొంగ నా కొడుకు)’ నవ్వించడంలో తడబడ్డాడు.
తాజావార్తలు
-
NZ vs IND 4th ODI: చెలరేగిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం!
-
KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
-
AP Panchayat Elections: మా అమ్మను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేయండి.. రూ.కోటి ఇస్తా.. కుమారుడి సంచలన ప్రకటన
-
IND vs NZ 4th ODI: రోహిత్, ఇషాన్ తప్పిదాలు.. 5 నుంచి 125 రన్స్!
-
Hyderabad: అక్రమ అండాల దందాలో కొత్త కోణం.. వెలుగులోకి షాకింగ్ వ్యవహారం..
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!