Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asus TUF Gaming F16 and A15 Launched in India: ప్రముఖ టెక్నాలజీ సంస్థ Asus భారత మార్కెట్లో కొత్త TUF Gaming సిరీస్‌ను విడుదల చేసింది. గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా TUF Gaming F16, Made in India TUF Gaming A15 ల్యాప్‌టాప్‌లతో పాటు TUF Gaming T700 Mini డెస్క్టాప్ను లాంచ్ చేసింది. గేమింగ్‌తో పాటు స్టడీస్, ఆఫీస్ వర్క్, రోజువారీ అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించింది. ఇందులో శక్తివంతమైన Intel, AMD ప్రాసెసర్లు, Nvidia GeForce RTX గ్రాఫిక్స్, మెరుగైన కూలింగ్ టెక్నాలజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Asus విడుదల చేసిన కొత్త గేమింగ్ ఉత్పత్తుల ధరలు, విక్రయ తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read
- OnePlus Turbo 7 Pro 5G: 10,000mAh బ్యాటరీతో OnePlus కొత్త 5G ఫోన్.. 200MP కెమెరా, 100W ఛార్జింగ్!
- Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
- Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!
- 38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
Asus TUF Gaming F16: Intel Core 5 వేరియంట్ ధర రూ.1,39,990. హైఎండ్ కాన్ఫిగరేషన్ ధర రూ.1,54,990.
Asus TUF Gaming A15 (FA506NCG): ప్రారంభ ధర రూ.1,32,990.
Asus TUF Gaming T700 Mini: ప్రారంభ ధర రూ.2,09,990.
TUF Gaming F16 విక్రయాలు నవంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. TUF Gaming A15, T700 Mini డెస్క్‌టాప్ విక్రయాలు డిసెంబర్ 1 నుంచి మొదలవుతాయి. ఈ ప్రొడక్ట్స్ ను Asus ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, Reliance Digital, Croma, Vijay Sales, Flipkart, Amazon, Asus E-Shop తదితర రిటైల్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనుగోలు చేయవచ్చు. F16 కొనుగోలుపై లోన్, నో కాస్ట్ EMI వంటి సదుపాయాలను కూడా కంపెనీ అందిస్తోంది.
Asus TUF Gaming F16 గేమింగ్ ల్యాప్‌టాప్‌లో రెండు ప్రాసెసర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో Intel Core 5 Processor 205H, Intel Core 7 Processor 230H ప్రాసెసర్లను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో ముఖ్యంగా MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉంది. గేమింగ్ సమయంలో వేడిని నియంత్రించేందుకు డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. దీని వల్ల ఎక్కువసేపు గేమింగ్ చేసినా స్థిరమైన పనితీరు పొందవచ్చు. ఇందులో 64GB వరకు RAM అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.
అలాగే 4TB వరకు SSD స్టోరేజ్ విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీ కోసం LAN పోర్ట్, HDMI 2.1, పవర్ డెలివరీ సపోర్ట్‌తో USB Type-C పోర్ట్‌తో పాటు ఇతర కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. Asus TUF Gaming A15 (FA506NCG) మోడల్లో AMD Ryzen 7 155 ప్రాసెసర్‌ను అందించారు. గ్రాఫిక్స్ కోసం Nvidia GeForce RTX 3050 GPU ఉంది. గేమింగ్, వీడియో ఎడిటింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 64GB వరకు RAM, 2TB వరకు SSD స్టోరేజ్ విస్తరించుకునే సదుపాయం ఉంది. హీట్‌ను నియంత్రించేందుకు డ్యూయల్ ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్, రియర్ ఎగ్జాస్ట్ వెంట్స్ ఇచ్చారు.
దీనికి కూడా MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే రెండు USB Type-C పోర్టులు, HDMI 2.1 పోర్ట్ అందించారు. దీని ద్వారా ఎక్స్టర్నల్ మానిటర్లు, ఇతర పెరిఫెరల్స్ను కనెక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ TUF Gaming A15 మోడల్‌ను మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిగా Asus పరిచయం చేసింది.
ఈ కొత్త లైనప్‌లో అత్యంత ఆసక్తికరమైన ఉత్పత్తి Asus TUF Gaming T700 Mini డెస్క్‌టాప్. చిన్న పరిమాణంలో శక్తివంతమైన గేమింగ్ పనితీరు అందించేలా దీనిని రూపొందించారు. ఈ డెస్క్‌టాప్‌లో Intel Core Ultra 5 ప్రాసెసర్ ఆప్షన్‌తో పాటు 8GB VRAM కలిగిన Nvidia GeForce RTX 5060 గ్రాఫిక్స్ అందించారు. మెమరీ విషయానికి వస్తే 64GB DDR5 RAM వరకు, 2TB SSD స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో టూల్లెస్ మెకానిజం ఉండటం వల్ల మెమరీ, స్టోరేజ్‌ను సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
డిజైన్ విషయానికి వస్తే అనిమే-ఇన్స్పైర్డ్ డిజైన్‌తో ఈ డెస్క్టాప్ను తీసుకొచ్చారు. ఇందులో ఎంటర్ప్రైజ్ గ్రేడ్ మదర్బోర్డ్, 100 శాతం సాలిడ్ కెపాసిటర్లు, 80 PLUS Platinum సర్టిఫైడ్ పవర్ సప్లై ఉన్నాయి. కనెక్టివిటీ కోసం హైస్పీడ్ USB-Cతో పాటు మొత్తం 9 USB పోర్టులు, మల్టీ డిస్ప్లే పోర్టులను అందించారు. దీనికి కూడా MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉంది.
Asus TUF Gaming F16, A15 ల్యాప్‌టాప్‌లు, T700 Mini డెస్క్టాప్ను కంపెనీ అధికారిక స్టోర్లతో పాటు ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. F16 విక్రయాలు నవంబర్ 18 నుంచి, A15, T700 Mini విక్రయాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
-
Mohamed Siraj Dropped: సిరాజ్‌ను అందుకే పక్కన పెట్టాం?.. అసలు విషయం చెప్పిన కెప్టెన్ గిల్!
-
International Men’s Day: “నువ్వు మగాడివి.. ఏడవకూడదు”.. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..