January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi Promotions for January 12 Vidudala: సినీ ఇండస్ట్రీలో వినూత్నమైన ప్రమోషన్స్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. దర్శకుడు అనిల్ రావిపూడి. తన సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఎప్పుడూ కొత్త పద్ధతులను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా వినోదాత్మకంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచడంలో తనదైన శైలిని చూపిస్తుంటారు. గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలకు అనిల్ చేసిన వెరైటీ ప్రమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాలు సినిమాలు జనాల్లోకి వెళ్లడానికి దోహదపడ్డాయి.
ఇప్పుడు మరోసారి అనిల్ రావిపూడి తన మార్క్ ప్రమోషన్స్‌కు తెరలేపారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’ కోసం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో ఉన్న ఇతర సినిమాల కంటే ముందుగానే నవంబర్ 20 నుంచి ‘జనవరి 12 విడుదల’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ప్రకటనను కూడా అనిల్ తనదైన వినోదాత్మక శైలిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Also Read
- Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. 'ఏవోటీ'తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
- Monalisa: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ఇప్పుడు ఎక్కడుంది? పెళ్లి తర్వాత జీవితం ఎలా మారింది?
- Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
- ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
సూపర్‌స్టార్ రజనీకాంత్, శోభన నటించిన ‘దళపతి’ సినిమాలోని ఐకానిక్ సీన్‌ను అనిల్ రావిపూడి, కృతి శెట్టి కలిసి ఫన్నీగా రీక్రియేట్ చేశారు. ఈ వీడియోలో ప్రమోషన్స్ విషయంలో అనిల్ చూపించే ఉత్సాహాన్ని సరదాగా ప్రస్తావించారు. ‘ప్రమోషన్స్ అంటే చాలు.. ప్రతిదానికి వచ్చేస్తాడు’ అంటూ కీర్తి సురేష్, కృతి మధ్య జరిగే సంభాషణ నవ్వులు పూయిస్తోంది. ‘ఇది మన గర్ల్స్ సాంగ్.. రా డాన్స్ వేద్దాం’ అనే డైలాగ్ కూడా వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మరి అనిల్ ఈసారి జనవరి 12 విడుదల కోసం ఇంకెన్ని వినూత్నమైన ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తారో చూడాలి.
Promotion ante chalu..
Andharikante mundhuntam 😉😉😉#January12Vidudala MUSICAL JOURNEY BEGINS FROM TOMORROW 😎🔥
Grand Worldwide Release on JANUARY 12th, 2027 ✨
Victory @VenkyMama @NANDAMURIKALYAN @AnilRavipudi @KeerthyOfficial @IamKrithiShetty @gvprakash @sahugarapati7 @YoursSKrishna @Shine_Screens @ZeeStudios_ @SureshProdns @zeestudiossouth @zeemusicsouth #NileshDeorah @girishjohar #AmeetBhuvan @IamDivyaVijay @HaashtagMedia @UrsVamsiShekar
— Shine Screens (@Shine_Screens) November 19, 2026
తాజావార్తలు
-
January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
-
B2B UPI Payment Charges: వ్యాపార లావాదేవీలపై రూ.5 ఛార్జీ?.. NPCI కొత్త ప్రతిపాదన ఇదే!
-
Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!
-
Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
-
WhatsApp New Update: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫీచర్ వివరాలివే!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!