OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
- కొంతమంది కూటమి ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ మొదలైందా?
- స్థానిక ఫలితాలు చిక్కుల్లోకి నెట్టాయా?
- ఐదుగురు మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలపై అధిష్టానం అసంతృప్తి?
- ముగ్గురు ఉత్తరాంధ్ర మంత్రులపై అసహనంగా హైకమాండ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: కొంతమంది..కూటమి ఎమ్మెల్యే ల్లో కొత్త టెన్షన్ మొదలైందా? స్థానిక ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఓటమి…మరి కొన్ని చోట్ల అనవసర వివాదాలు కొంతమంది ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారుతోందా? ఉత్తరాంధ్రలో ఒకరిద్దరు మంత్రులపై కూడా సీఎం అసంతృప్తితో ఉన్నారా? వీరిపై నివేదికలు రెడీ అయ్యాయా? రేపోమాపో చర్యలు సిద్దమవుతున్నాయా? స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు మెజార్టీ సీట్లు సాధించాయి. వైసీపీ మున్సిపల్ కంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. వైసీపీ గెలుపు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలను చిక్కుల్లోకి నెడుతోంది. అది వైసీపీ గెలుపు కాదని..మంత్రులు, ఎమ్మెల్యేల ఓటమిగా టీడీపీ హైకమాండ్ ఆగ్రహంగా వుంది. దీంతో వారి నుంచి నివేదికలు కోరిందట. త్వరలో చర్యలకు సిద్దమవుతోందని తెలుస్తోంది. దీంతో సదరు మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. అధిష్టానం జాబితాలో ఎవరి పేర్లున్నాయో…ఎలాంటి చర్యలుంటాయోనని నేతలు టెన్షన్ పడుతున్నారు.
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కూటమికి, అందులోనూ టీడీపీకి అంతుచిక్కడం లేదు. కౌన్సిలర్ల రూపంలో మెజార్టీ సీట్లు గెలిచినా….మేయర్ ఎన్నిక మాత్రం ఊహించని షాక్‌లా తగిలింది. స్థానికంగా కూటమి నేతల మధ్య సమన్వయం లేకపోవటమే ఓటమికి కారణమని టీడీపీ నేతలు తేల్చారట. అనంతపురంలో అభ్యర్థిగా బీజేపీ నేతను బరిలోకి దింపడం, ఆ అభ్యర్ధి కుటుంబంపై స్థానికంగా వ్యతిరేకత వుండటం వంటి కారణాలను కూడా ఓటమికి కారణమంటూ కూటమి నేతలు చెబుతున్నారట. అంతేకాదు, స్థానిక ఎమ్మెల్యే పై వ్యతిరేకత భారీస్థాయిలో వుందని, అది కూడా ఓటమికి ముఖ్య కారణమని హైకమాండ్‌కు నివేదించారట. జిల్లా మంత్రులను కూడా అనంతపురం విషయంలో అధిష్టానం వివరణ అడిగిందని తెలుస్తోంది.
Also Read
ఇక, జెడ్పీటీసీ – ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ ఇచ్చింది. 76 జెడ్పీటీసీ, 1711 ఎంపీటీసీలు గెలిచింది. వాస్తవంగా వైసీపీ సైతం ఈ స్థాయిలో సీట్లు దక్కుతాయని అంచనా వేయలేదు. దీనిపైనే ఇప్పుడు టీడీపీ నాయకత్వం ఇప్పటికే పోస్టుమార్టం చేస్తోంది. నివేదికలను కూడా పరిశీలిస్తోంది. టీడీపీ హైకమాండ్ కు అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అయిదుగురు మంత్రులు, దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు సమర్ధవంతంగా పని చేయలేదని గుర్తించినట్లు తెలుస్తోంది. అందులో ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు మంత్రుల పేర్లు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
విజయనగరం జిల్లాలో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శించినా.. వైసీపీకి వచ్చిన ఓట్లు.. సీట్లు మింగుడు పడటం లేదట. అక్కడ మూడు పార్టీల మధ్య సమన్వయం దెబ్బ తిన్నట్లుగా స్పష్టంగా అర్థమైందని అధిష్టానం చిట్టాపద్దులు తీస్తోంది. ఇక్కడ ఇద్దరు మంత్రులతో పాటుగా జనసేన ఎమ్మెల్యే, స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా వ్యవహరించలేదని టీడీపీ పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. ఒక మంత్రి తీరుపైన ఆరోపణలు వస్తున్నాయట. ఆయన కారణంగానే వైసీపీ 5 జెడ్పీటీసీలు, 101 ఎంపీటీసీలు గెలిచిందనే చర్చ సాగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నివేదికలు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోవాలని డిసైడయ్యింది తెలుగుదేశం అధిష్టానం.
అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, జగ్గయ్యపేట జెడ్పీటీసీలు వైసీపీ గెలవటం కూడా టీడీపీ హైకమాండ్‌కు బోధపడ్డం లేదట. గన్నవరం బీజేపీకి ఇవ్వటం.. టీడీపీ, జనసేన కేడర్ కలిసి పని చేయకపోవడం కారణాలు ఓటమికి దారి తీశాయన్న ఒపీనియన్‌కు అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇద్దరు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఉమ్మడి అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రుల నుంచి వివరణ కోరేందుకు టీడీపీ నాయకత్వం సిద్దమైందని తెలుస్తోంది. తిరుపతి, కదిరి, పుట్టపర్తి, జీడీ నెల్లూరు వంటి నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలతో అక్కడ ఎమ్మెల్యేలు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో వచ్చే వారం ఈ ఫలితాలపైన పూర్తిస్థాయిలో సమీక్ష జరుగుతుందని హైకమాండ్ ఇప్పటికే చెప్పిందట. నివేదికల ఆధారంగా తప్పకుండా చర్యలు ఉంటాయని సమాచారం. యాక్షన్ లిస్టులో తమ పేరు వుంటుందేమోనని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల్లో గుబులు పెరుగుతోంది. టీడీపీ అధిష్టానం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
-
Pakistan BLA: పాక్ సైన్యంలో కెప్టెన్.. ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అధిపతి!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!