AP-Tamil Nadu: తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఏపీకి లీక్.? 15 మంది అధికారులపై విజయ్ సర్కార్ వేటు..
- ఏపీ, తమిళనాడుల మధ్య పెట్టుబడుల పోరు..
- తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ సమాచారం లీక్ అయినట్లు ఆరోపణలు..
- 15 మంది ఉద్యోగుల్ని తొలగించిన విజయ్ సర్కార్..
- ముగ్గురికి ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలిలో ఉద్యోగాలు..
- తమపై డీఎంకే కుట్ర చేస్తుందన్న తమిళనాడు మంత్రి కీర్తన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: ఆంధప్రదేశ్, తమిళనాడు మధ్య పెట్టుబడుల పోటీ నెలకొంది. ఇటీవల కాలంలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఏపీకి తరలి వచ్చాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించిన రహస్య వివరాలను చేరవేశారనే అనుమానంతో ముఖ్యమంత్రి విజయ్ సర్కార్ 15 మంది సీనియర్ అధికారులను తొలగించినట్లు తెలుస్తోంది. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు అధికారులు, ఆ తర్వాత డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ అదే పదవుల్లో కొనసాగారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోవడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కంపెనీల పెట్టుబడుల వివరాలు లీక్..?
తమిళనాడు పరిశ్రమ శాఖ పరిధిలో పనిచేసే టీమ్ ఈ సమాచార లీకేజ్ వ్యవహారాన్ని గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమిళనాడులో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే కంపెనీలతో ప్రభుత్వం జరిపే చర్చలు, పెట్టుబడులకు సంబంధించిన సున్నిత సమాచారం లీకైనట్లు అనుమానిస్తున్నారు. ఈ వివరాలను ఏపీ అధికారులకు చేరవేసినట్లు విజయ్ సర్కార్ భావిస్తోంది. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన జూలైలో విధుల నుంచి 15 మందిని తొలగించారు.
Also Read
- National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
- Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
- Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
ఉద్యోగాల నుంచి తొలగించిన తర్వాత క్రిస్టో లారెల్, ప్రభాకరన్ అండి, ప్రీజా ప్రసాద్ అనే ముగ్గురికి ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలిలో ఉద్యోగాలు వచ్చాయి. వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో ప్రత్యక్షం కావడంతో వీరి ఫోటోలు వైరల్‌గా మారాయి. తనపై కావాలనే డీఎంకే కుట్ర చేస్తోందని మంత్రి కీర్తన ఆరోపిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు దఫాల్లో చేసిన రివ్యూల్లో సమాచారం లీకేజీలో ఉద్యోగుల పాత్రపై అనుమానం వచ్చి తొలగించినట్లు ఆమె చెబుతున్నారు. తమిళనాడుకు రావాల్సిన పెట్టుబడులు ఏపీకి తరలిపోతున్నాయని మాజీ సీఎం స్టాలిన్ ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
AP-Tamil Nadu: తమిళనాడు పెట్టుబడుల రహస్యాలు ఏపీకి లీక్.? 15 మంది అధికారులపై విజయ్ సర్కార్ వేటు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!