Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tandoori Roti Recipe: తందూరీ రోటీ అంటే చాలామందికి ఇష్టం.. అయితే దాని కోసం సమీపంలోని హోటల్.. లేదా నచ్చిన రెస్టారెంట్‌కు వెళ్తారు.. హోటల్‌కు లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు దాల్ మఖానీ, పనీర్ కర్రీ వంటి గ్రేవీ వంటకాలతో తందూరీ రోటీని తినడానికి ఇష్టపడుతుంటారు. బయట లభించే తందూరీ రోటీ ప్రత్యేకమైన రుచి, కరకరలాడే ఆకృతి ఆహార ప్రియులను ఆకట్టుకుంటాయి. అయితే ఇంట్లో కూడా ఇలాంటి రోటీలను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా తందూర్ లేదా ఓవెన్ కొనాల్సిన అవసరం లేదు. మనం రోజూ ఉపయోగించే ప్రెషర్ కుక్కర్‌తోనే హోటల్ స్టైల్ తందూరీ రోటీలను సులభంగా తయారు చేసుకోవచ్చు.
తందూరీ రోటీ తయారీకి కావలసిన పదార్థాలు
ఇంట్లోనే రుచికరమైన తందూరీ రోటీలను తయారు చేసుకోవడానికి రెండు కప్పుల మైదా, ఒక కప్పు గోధుమ పిండి, ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, అర కప్పు పెరుగు, అవసరమైనంత గోరువెచ్చని పాలు, కొద్దిగా చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర ఆకులు, కొద్దిగా నల్ల జీలకర్ర గింజలు, రోటీలకు పూయడానికి వెన్న లేదా నెయ్యి సిద్ధంగా ఉంచుకోవాలి.
Also Read
- Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
- Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే 'మరమరాల మిక్చర్' సులువుగా చేసుకోండి ఇలా..!
- Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే 'ఉసిరికాయ పులిహోర'.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
- Homemade Healthy Snacks: బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పల్చటి, క్రిస్పీ నువ్వుల పట్టీ.. ఇలా చేస్తే 2 వారాలు ఫ్రెష్!
ప్రెషర్ కుక్కర్లో తందూరీ రోటీ తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదా, గోధుమ పిండి తీసుకుని అందులో బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గోరువెచ్చని పాలు, పెరుగు, చక్కెర, నూనె వేసి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పిండిలో కొద్దికొద్దిగా పోస్తూ మెత్తగా కలుపుకోవాలి. అనంతరం పిండిని మూతపెట్టి సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని గుండ్రంగా లేదా పొడవుగా రోటీ ఆకారంలో ఒత్తుకోవాలి. రోటీపై సన్నగా తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర ఆకులు, నల్ల జీలకర్ర గింజలు చల్లాలి. అవి రోటీకి బాగా అంటుకునేలా చపాతీ కర్రతో మెల్లగా ఒత్తాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్‌పై ప్రెషర్ కుక్కర్‌ను తలకిందులుగా ఉంచి వేడి చేయాలి. రోటీకి మసాలాలు వేయని మరోవైపు కొద్దిగా నీళ్లు రాయాలి. ఆ తడి భాగాన్ని వేడిగా ఉన్న కుక్కర్ లోపలి గోడకు జాగ్రత్తగా అంటించాలి. ఇలా రెండు నుంచి మూడు రోటీలను కుక్కర్ గోడలకు అంటించుకోవచ్చు. కొద్దిసేపటికి రోటీలు ఉబ్బుతూ వాటిపై బంగారు గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. రోటీలు బాగా కాలిన తర్వాత వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి. అవసరమైతే గ్యాస్ మంటపై కొద్దిగా కాల్చుకోవచ్చు. చివరగా వేడివేడి రోటీలకు వెన్న లేదా నెయ్యి రాస్తే మంచి రుచి వస్తుంది.
ఏ కర్రీలతో తింటే బాగుంటుంది?
ఇంకేముంది.. హోటల్ స్టైల్లో కరకరలాడే, రుచికరమైన తందూరీ రోటీలు సిద్ధమైనట్లే. వీటిని దాల్ మఖానీ, పనీర్ సబ్జీ, మటర్ పనీర్ వంటి గ్రేవీ వంటకాలతో కలిపి తింటే అద్భుతంగా ఉంటాయి. ఇంట్లోనే సులభంగా, ప్రత్యేకమైన పరికరాలు లేకుండా ఈ తందూరీ రోటీలను తయారు చేసుకుని కుటుంబ సభ్యులకు అందించవచ్చు. ఇక, దానికి సరిపోయే విధంగా మంచి గ్రేవీ వంటకం రెడీ చేసుకుంటే.. తింటూ ఆస్వాదించవచ్చు..
తాజావార్తలు
-
Tandoori Roti Recipe: ఇంట్లోనే కరకరలాడే తందూరీ రోటీ.. ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్‌గా హోటల్ స్టైల్ తందూరీ రోటీ..!
-
Asus TUF Gaming F16, A15: Asus TUF Gaming F16, A15 లాంచ్.. RTX గ్రాఫిక్స్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
-
Mohamed Siraj Dropped: సిరాజ్‌ను అందుకే పక్కన పెట్టాం?.. అసలు విషయం చెప్పిన కెప్టెన్ గిల్!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..