Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
- ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
- జనవరిలోనే ప్రాక్టికల్స్, అసెస్మెంట్
- మార్చి 20న ముగియనున్న పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) ఫిబ్రవరి/మార్చి 2027 తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విడుదల చేసింది. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 20 వరకు కొనసాగనున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు థియరీ పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్, ఒకేషనల్ విభాగాల విద్యార్థులకు ఈ తేదీలు వర్తిస్తాయని బోర్డు స్పష్టం చేసింది, అయితే ఒకేషనల్ కోర్సుల టైమ్‌టేబుల్‌ను వేరుగా విడుదల చేస్తామని తెలిపింది.
ప్రాక్టికల్స్, అసెస్మెంట్ షెడ్యూల్ ఇలా
థియరీ పరీక్షలకు ముందే ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్మెంట్, ఇతర పరీక్షలను పూర్తి చేయనున్నారు. జనవరి 20 నుంచి 25 వరకు ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు జరుగుతాయి. జనవరి 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష, జనవరి 29న అదే సమయంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 29న ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్, జనవరి 30న సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉంటాయి.
Also Read
- Uttam Kumar Reddy : జలవాటాలో ఒక్క చుక్కా వదులుకోం.. ఏపీ యత్నాలను అడ్డుకుంటాం
- CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
- Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు కింగ్ నాగార్జున మద్దతు..
- Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
సెకండ్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ఆదివారాలతో సహా ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం సెషన్ 2 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఇక కొత్త విధానంలో ఫస్ట్ ఇయర్ సైన్స్ ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు ఆదివారం కూడా కలుపుకుని రోజుకు మూడు సెషన్లలో నిర్వహిస్తారు. ఒక్కో సెషన్ రెండు గంటల పాటు ఉంటుంది. సెషన్-1 ఉదయం 9 నుంచి 11 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు, సెషన్-3 మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుంది.
ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షల తేదీలు
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 24న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1తో పరీక్షలు మొదలవుతాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లీష్ పేపర్-1, మార్చి 2న మ్యాథమెటిక్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1, అకౌంటెన్సీ పేపర్-1 (ఏసీఈ గ్రూప్) పరీక్షలు ఉంటాయి. మార్చి 5న మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, కామర్స్ పేపర్-1 (ఏసీఈ గ్రూప్) నిర్వహిస్తారు.
మార్చి 9న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1, మార్చి 15న కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. మార్చి 17న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, ఎంఈసీ గ్రూప్‌కు మ్యాథమెటిక్స్ పేపర్-1 (సింగిల్ పేపర్) ఉంటాయి. చివరి రోజు మార్చి 19న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-1 పరీక్షలు నిర్వహిస్తారు.
సెకండ్ ఇయర్ థియరీ పరీక్షల తేదీలు
సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 25న సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2తో పరీక్షలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ పేపర్-2, మార్చి 3న మ్యాథమెటిక్స్ పేపర్-2ఎ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. మార్చి 8న మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 పరీక్షలు ఉంటాయి.
మార్చి 12న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2, మార్చి 16న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-2 నిర్వహిస్తారు. మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, మార్చి 20న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2, బైపీసీ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-2 పరీక్షలతో థియరీ పరీక్షలు ముగుస్తాయి.
తాజావార్తలు
-
Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
-
ENE Repeat: సత్యకు గట్టి పోటీ.. ‘ఈఎన్ఈ రిపీట్’తో లీగ్ `లోకి అభినవ్ గోమఠం
-
Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు!
-
TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
-
Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!