OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
- ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లా అంబేద్కర్ కోనసీమ జడ్పీ రేస్
- బీర సత్యకుమారి, గొల్లపల్లి అమూల్య మధ్య పోటాపోటీ?
- బీర సత్య కుమారి కోసం కోనసీమ కూటమి ఎమ్మెల్యేల పావులు?
- గొల్లపల్లి అమూల్య కోసం జిల్లా పార్టీ నేతల చక్రం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ పీఠం కోసం టిడిపిలో ఇద్దరు మహిళా జెడ్పీటీసీల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొంది. ఒకరు పార్టీలో సీనియర్ గా ఉంటూ గతంలో ఎమ్మెల్యే టికెట్ చేజార్చుకున్నారు. మరొకరు పార్టీలో చేరిన ఏడాదిలోనే వరుస పదవులు దక్కించుకున్నారు. అయితే పైకి మహిళా నేతల మధ్య పోటీగా కనిపిస్తున్నా…వారి వెనుక కోనసీమ టిడిపిలో కీలక నేతల వర్గపోరు రసవత్తరంగా మారుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా జడ్పీపీఠం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ఈనెల 20న నిర్వహించనున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికలో జెడ్పీ పీఠం దక్కిందేవరికి అనే సస్పెన్స్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లా సాగుతోంది. ఎవరికి వారు తెర వెనక వ్యూహాలు వేస్తుండటంతో హైఓల్టేజ్ వార్ నడుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పునర్విభజన తర్వాత కోనసీమ జిల్లా పరిషత్ కొత్తగా ఏర్పడింది. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలోని 19 జడ్పిటిసి స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన కోనసీమ జెడ్పి పీఠం కూటమి మూడు పార్టీల సర్దుబాటులో టిడిపికే దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో బీర సత్యకుమారి…. గొల్లపల్లి అమూల్య మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. వీరిలో బీర సత్యకుమారి పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్ గా ఉన్న మహిళా నేత. గొల్లపల్లి అమూల్య ఏడాది క్రితమే పార్టీలో చేరారు. కోనసీమ జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా బీర సత్య కుమారి వైపు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గొల్లపల్లి అమూల్యకు సైతం జిల్లా టిడిపిని కీలకంగా నడిపిస్తున్న నేతల మద్దతిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీంతో ఇద్దరు మహిళల మధ్య పోటీ టగ్ ఆఫ్లా మారింది. ఇద్దరి కోసం కోనసీమ టిడిపి ముఖ్య నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. జడ్పీ చైర్ పర్సన్ పదవి సీనియర్ కు దక్కుతుందా లేక జూనియర్ ఎగరేసుకుపోతారా అనేది ఒకటి రెండు రోజుల్లోనే తేలబోతోంది.
విజువల్స్
సీనియార్టీ కోటా సహా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న బీర సత్యకుమారికేనని అంటున్నారు. ఆమె టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో పని చేస్తున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం తొలుత ఆమె పేరును ప్రకటించి బీ ఫారం కూడా అందించింది. అయితే వెంటనే టికెట్ మార్చి మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద భార్య శేష కుమారికి ఇచ్చారు. అయితే ఎలాంటి అసమ్మతి లేకుండా ఆమె పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ ఐ.పోలవరం ఎంపీపీ గానూ…గత వైసిపి హయాంలో కేశనకుర్రు సర్పంచ్‌గానూ పని చేశారు. ప్రస్తుత పరిషత్ ఎన్నికల్లో ఐ.పోలవరం జెడ్పీటీసీగా 9 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పార్టీలో తన సేవలకు గుర్తింపుగా జెడ్పీ చైర్పర్సన్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. బీర సత్యకుమారికి ముమ్మిడివరం టిడిపి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మద్దతుగా నిలుస్తున్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్‌తో పాటు ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ సహా కోనసీమ జిల్లాకు చెందిన మెజారిటీ కూటమి ఎమ్మెల్యేలు సత్యకుమారికే ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు తమ అభిప్రాయం చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తన నియోజకవర్గానికి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కోసం ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆర్థికంగా సైతం సంసిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో అనుకుంటున్నారు.
Also Read
మరోవైపు గొల్లపల్లి అమూల్య ఈనెల 7న వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో మామిడికుదురు జడ్పిటిసిగా దాదాపు 12 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె మాజీ మంత్రి… వైసిపి నేత గొల్లపల్లి సూర్యారావు కుమార్తె. 2024 ఎన్నికల అనంతరం టిడిపిలో చేరారు. 2025 సెప్టెంబర్ లో పార్టీ కండువా కప్పుకున్న ఆమె ఇప్పటికే రెండు పదవులు దక్కించుకున్నారు. పార్టీలో చేరిన మరుక్షణమే రాజోలు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగాను.. తర్వాత టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా అవకాశాలు దక్కించుకున్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి గతంలో రాజోలు టిడిపి ఎమ్మెల్యేగానూ పనిచేశారు. దీంతో అక్కడ టిడిపి క్యాడర్ గొల్లపల్లి అమూల్యకు మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు అమూల్యకు జెడ్పీ పీఠం దక్కేలా తెర సకల అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. దీంతో పాటు కోనసీమ జిల్లా టీడీపీలో క్రియాశీలకంగా మారిన కాకినాడకు చెందిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఆశీస్సులు కూడా అమూల్యకే ఉన్నట్లుగా చెప్తున్నారు. దీంతో సీనియర్, జూనియర్ లేడీ లీడర్ల మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోటీ నెలకొంది.
అయితే, సత్యకుమారితో పోలిస్తే మాత్రం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు అమూల్యకు ఎక్కువగా లేదు అనే ప్రచారం వినిపిస్తోంది. అటు రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్…ఇటు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూడా వ్యతిరేకం అనే చర్చ సైతం సాగుతోంది. అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కావడంతో చివరికి…జడ్పీపీఠం ఎవరికి దక్కుతుందోనన్న సస్పెన్స్ త్వరలోనే వీడనుంది. కోనసీమ జిల్లాలో టిడిపి శ్రేణులు మాత్రం యువత కోటా…చురుగ్గా పని చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గొల్లపల్లి అమూల్యకే ఛాన్స్ ఎక్కువగా ఉండొచ్చనీ అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే రాజోలు లేదా పి. గన్నవరం నియోజకవర్గాలకు 2029 ఎన్నికల నాటికి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్లపల్లి అమూల్య పేరు పరిశీలనలో ఉంది. దీంతో ఆమెను జెడ్పి పీఠానికి కాకుండా రానున్న ఎన్నికల నాటికి అభ్యర్థిగా రిజర్వులో ఉంచే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయని నేతలు మాట్లాడుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ సస్పెన్స్ కు తెరపడనుంది.
తాజావార్తలు
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!