OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
- సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో టీడీపీ ఓటమి..
- రెడ్డి నేతకే టిక్కెట్ ఇచ్చి ఉండాల్సిందంటూ ఇప్పుడు విశ్లేషణలు..
- వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతకు టిక్కెట్ ఇవ్వడం మైనస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ టీడీపీ నాయకులు అంతర్గతంగా వైసీపీకి సహకరిస్తూ టీసీపీ లీడర్స్‌గా మారిపోయారా? మున్సిపాలిటీ చేజారిపోవడానికి అదే ప్రధాన కారణమా? రాజకీయ ప్రత్యర్థికి తెర వెనక సహకారమే నిజమైతే… అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అక్కడ తెర మీదికి వచ్చిన కులాల లెక్కలేంటి? తెలుగుదేశం అధిష్టానం దగ్గర ఎమ్మెల్యేని బద్నాం చేయడానికి కొందరు గేమ్ ఆడి గెలిచారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా స్టోరీ?
ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండు చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సూళ్లూరుపేట మున్సిపాలిటీలో టీడీపీ ఆధిపత్యం సాధించగా.. నాయుడుపేటలో మాత్రం బోర్లా పడింది. ఇక్కడ 32 స్థానాలకు గాను.. చైర్మన్‌తో పాటు 13 చోట్ల వైసీపీ గెలిచింది. టిడిపి తరఫున చైర్మన్ అభ్యర్థిగా మైనార్టీ నేత షాకిర, వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వరమ్మ పోటీ పడ్డారు. వాస్తవంగా చెప్పాలంటే… నాయుడుపేటలో ఫ్యాన్ పార్టీకి మున్సిపాలిటీని గెల్చుకునేంత బలం లేదు. కానీ… అభ్యర్థి కుటుంబానికి మంచి పేరు ఉండటం, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు సాలిడ్ అవడంతో పరిస్థితి మారిందని విశ్లేషిస్తున్నారు.
Also Read
తెలుగుదేశం కూడా రెడ్డి నేతనే బరిలో దింపి ఉంటే లెక్క వేరుగా ఉండేదన్నది ఓ అనాలసిస్. నాయుడుపేటలో అభ్యర్థి ఎంపిక నుంచి… పోల్ మేనేజ్మెంట్ దాకా…. ప్రతి విషయంలోనూ స్థానిక టిడిపి నేతలు తప్పటడుగులు వేశారని అంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నేతను చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోయారట. అలాగే… వైసీపీ బలాన్ని సరిగ్గా అంచనా వేయకపోవడం కూడా ఓటమికి మరో కారణమని అంటున్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ రావడానికి పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ కారణమని చెప్పుకుంటారు. కానీ….ఎమ్మెల్యేగా గెలిచాక గంగా ప్రసాద్‌కు, నెలవల ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందట. తమను కాదని ఆమె రాజకీయం చెయ్యడం కొందరు కీలక నేతలకు నచ్చలేదని అంటున్నారు.
అందుకే… ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టి…. అధిష్టానం దగ్గర ఆమెను డీ ఫేం చెయ్యాలని భావించారట. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో వాటిని వాడుకున్నట్టు చెప్పుకుంటున్నారు. కొన్ని చోట్ల పోలీసులను ఉపయోగించుకుని వైసీపీ నేతల ఇళ్లలో మద్యం బాటిల్స్ పెట్టించడం దగ్గర నుంచి.. వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపడం దాకా మొత్తం స్థానిక కీలక నేతల కనుసన్నల్లోనే జరిగిందన్న గుసగుసలు ఉన్నాయి. అదంతా ఎన్నికలకు ముందే బయటికి తెలిసి వైసీపీ అభ్యర్థికి సానుభూతిగా మారిందన్న వాదన సైతం ఉంది. అలాగే… వైసీపీలో ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను ఇబ్బంది పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం కూడా టిడిపిలోని అదే సామాజిక వర్గం నాయకులకు నచ్చలేదట.
వైసిపి అభ్యర్థి తమ్మిరెడ్డి రాజేశ్వరమ్మ కుటుంబానికి మంచి పేరు ఉండడంతో… తెలుగుదేశంలోని ఆ సామాజికవర్గం నాయకులు తెర వెనక సాయం చేసినట్టు చెప్పుకుంటున్నారు. కొన్ని వార్డుల్లో దగ్గరుండి చైర్మన్‌కు క్రాస్ ఓటింగ్ వేయించారన్న ప్రచారం సైకిల్ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అటు పెళ్ళకూరు జడ్పీటీసీతోపాటు.. కొన్ని ఎంపీటీసీల స్థానాల్లో ఓటమికి అక్కడి టిడిపి నేతలు అత్యుత్సాహమే కారణమైందంటున్నారు. నాయుడుపేట మున్సిపాలిటీలో ఓ పోలీస్ అధికారి చేసిన ఓవరాక్షన్ కూడా టిడిపికి మైనస్ అయిందన్న లెక్కలున్నాయి. జైలు నుంచే పోటీ చేసి పెళ్లకూరు జడ్పిటిసి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి గెలిచారు.
ఇలా టీడీపీ నేతల అత్యుత్సాహంతో నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ తో పాటు కొన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను టిడిపి కోల్పోవాల్సి వచ్చిందట. నేతల మధ్య సమన్వయం లేకపోవడం.. పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ తీరుపై విసిగిపోయిన వాళ్ళంతా వైసీపీకి అనుకూలంగా పనిచేశారన్నది లోకల్ టాక్. నాయుడుపేటలో ఆర్యవైశ్య సామాజిక వర్గంతో పాటు మరో రెండు బలమైన కులాలను టీడీపీ దూరం చేసుకుందని, ఇది కూడా ఓటమికి మరో కారణమన్న చర్చ జరుగుతోంది.
సూళ్లూరుపేటలో టీడీపీ గెలిస్తే…. ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకున్న కీలక నేతలు.. నాయుడుపేటలో ఓటమిని మాత్రం ఎమ్మెల్యే కుటుంబంపై నెట్టేశారని, నియోజకవర్గ టిడిపిలో రెండు వర్గాలు ఉండటమే ఇందుకు కారణమంటూ పాత తరం నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గాన్ని గాడిలో పెట్టకపోతే… అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇంకా తేడా కొడుతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
-
RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!