EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్‌పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO New Rules 2026: ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కనీవినీ ఎరుగని శుభవార్త అందించింది. అత్యవసర సమయాల్లో మన సొంత డబ్బును మనం తీసుకోవడానికి ఉండే కఠిన రూల్స్‌ను పూర్తిగా మార్చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీ పీఎఫ్ ఖాతాలోని డబ్బులో ఏకంగా 90 శాతం మొత్తాన్ని తక్షణమే విత్‌డ్రా చేసుకునే సువర్ణావకాశం కల్పించింది. ఈపీఎఫ్ స్కీమ్ 2026లో తీసుకొచ్చిన ఈ సంచలన మార్పు లక్షలాది మంది ఉద్యోగులకు నిజంగానే ఒక జాక్‌పాట్ లాంటి వార్త. ఇంతకుముందు ఉన్న నిబంధనల ప్రకారం.. 55 ఏళ్ల వయస్సు రాకముందే ఉద్యోగం మానేసే వారు లేదా పాక్షిక ఉపసంహరణ కోరుకునే వారు తమ పీఎఫ్ ఖాతా నిల్వలో గరిష్టంగా 75% మాత్రమే తీసుకోగలిగేవారు. ఖాతాలో కనీసం 25% నిల్వ ఉంచడం తప్పనిసరిగా ఉండేది. కానీ, తాజాగా ఆ కనీస నిల్వ పరిమితిని 25 శాతం నుండి 10 శాతానికి తగ్గిస్తూ ఈపీఎఫ్ఓ కీలక ఆమోదం తెలిపింది. దీనివల్ల ఖాతాదారులు కొన్ని షరతులకు లోబడి, తమ మొత్తం బ్యాలెన్స్‌లో 90% సొమ్మును నేరుగా చేతికి తీసుకునే వీలు కలిగింది.
ఏడాది నిరీక్షణకు చెక్.. 2 నెలల్లోనే క్లెయిమ్
మరో భారీ ఊరట ఏమిటంటే, నిరుద్యోగ సమయంలో పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఉండే నిరీక్షణ కాలాన్ని భారీగా తగ్గించారు. గతంలో ఉద్యోగం కోల్పోయినా లేదా మానేసినా డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఏడాది పాటు (12 నెలలు) వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ కాలాన్ని ఏకంగా 2 నెలలకు కుదించారు. అంటే ఉద్యోగం మానేసిన రెండు నెలలకే మీ ఖాతాలోని నగదును క్లెయిమ్ చేసుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత చేతికి వచ్చే పెద్ద మొత్తాన్ని ఒకేసారి ఖర్చు చేయకుండా, భవిష్యత్తుకు భరోసాగా మార్చుకునేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సరికొత్తగా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రిటైర్ అయిన ఉద్యోగులు తమ పీఎఫ్ నిధిని ఒకేసారి కాకుండా, నిర్ణీత వాయిదాలలో నెలనెలా స్థిరమైన ఆదాయంలా పొందే వీలుంటుంది. ఒకవేళ ఈ చెల్లింపుల కాలంలో సభ్యుడు మరణిస్తే, మిగిలిన మొత్తాన్ని ఒకేసారి తీసుకునే లేదా ఆ వాయిదాలను కొనసాగించే పూర్తి హక్కు నామినీకి ఉంటుంది.
Also Read
- Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
- Wedding Business: 25 రోజుల్లో రూ.7.50 లక్షల కోట్ల వ్యాపారం.. పెళ్లిళ్ల జోరు మామూలుగా లేదుగా!
- PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
- B2B UPI Payment Charges: వ్యాపార లావాదేవీలపై రూ.5 ఛార్జీ?.. NPCI కొత్త ప్రతిపాదన ఇదే!
ఏ అవసరాలకు ఈ 90% విత్‌డ్రాయల్ వర్తిస్తుంది?
ఈ మినహాయింపు ప్రతి ఒక్కరికీ, ఏ కారణం చేతనైనా గుడ్డిగా వర్తించదు. నిర్దిష్ట నియమ నిబంధనలు, అర్హత ప్రమాణాలకు లోబడి ఈ క్రింది ముఖ్య అవసరాల కోసం నిధులను తీసుకోవచ్చు.
* వైద్య చికిత్సలు: సభ్యుడికి లేదా వారి కుటుంబ సభ్యుల అనారోగ్య ఖర్చుల కోసం.
* ఉన్నత విద్య: పిల్లల చదువులు లేదా ఉన్నత విద్యా అవసరాలను తీర్చడానికి.
* వివాహ ఖర్చులు: స్వంత లేదా కుటుంబ సభ్యుల పెళ్లిళ్ల కోసం.
* సొంతింటి కల: కొత్త ఇల్లు లేదా స్థలం కొనడానికి, ఇంటి నిర్మాణానికి, మరమ్మతులకు, అలాగే ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ తిరిగి చెల్లించడానికి.
కష్టకాలంలో ఆదుకోవాల్సిన పీఎఫ్ నిధులను సామాన్య ఉద్యోగికి మరింత చేరువ చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఏ కేటగిరీ కింద ఎంత మొత్తం వస్తుంది, ఎన్నిసార్లు తీసుకోవచ్చు అనే రూల్స్‌ను క్షుణ్ణంగా తెలుసుకుని క్లెయిమ్ చేసుకోవడం ఉత్తమం.
తాజావార్తలు
-
EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్‌పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
-
UGC NET Exam Schedule: 87 సబ్జెక్టులు.. 6 రోజులు.. 2 షిఫ్టులు! యూజీసీ నెట్ 2026 షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..
-
Telangana Jobs : నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
-
Asteroids: భూమి వైపు దూసుకొస్తున్న 5 గ్రహశకలాలు.. నాసా 48 గంటల పాటు అలర్ట్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!