OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీసీసీ చీఫ్ సొంత జిల్లా పై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఒకప్పుడు కంచు కోటగా ఉన్న ఆ జిల్లాలో పార్టీ పూర్వ వైభవం కోసం.. స్వయంగా ఆ పార్టీ అధినేత రంగంలో దిగుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల పై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆ పార్టీ.. ఈ నెలలో నాలుగు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించింది. ఈనెల 19న తల పెట్టిన నిజామాబాద్ సభ వాయిదా పడింది. కేటీఆర్ సభ వాయిదా వెనుక అసలు ఏం జరిగింది..? కేటీఆర్ కాకుండా కేసీఆర్ ఎందుకు సభ కు ఫోకస్ పెట్టారు?
ఉత్తర తెలంగాణ జిల్లాలను కవర్ చేస్తూ.. బి.ఆర్. ఎస్. వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ రైతు గర్జన పేరిట నాలుగు భారీ బహిరంగ సభలను ప్లాన్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లక్ష్య గా ఈ సభలు ఆదిలాబాద్, నిర్మల్ లో సభలు నిర్వహించారు. మూడో సభ ఈ నెల 19 న జరగాల్సి ఉండగా.. ఉన్నపలంగా సభ వాయిదా వేశారట ఆ పార్టీ నేతలు. సభను ఎక్కడ పెట్టాలనే అంశంపై నేతల మధ్య చర్చోప చర్చలు జరిగాయట. ఐతే మాజీ ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కుదరలేదట. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో సభ పెట్టాలని ప్రతిపాదన పెట్టగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు నసేమిరా అన్నారట. మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో సభ ఎందుకంటూ.. పెదవి విరిచారట.
Also Read
సభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెట్టాలని కొందరు, కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెడితే బాగుంటుందని మరి కొందరు మాజీలు ప్రతిపాదన పెట్టారట. కానీ సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సయోధ్య కుదరక వాయిదా వేశారనే టాక్ గులాబీ పార్టీలో నడుస్తుది. మరో వైపు.. ఈనెల 29న కరీంనగర్ జిల్లా అలగనూరు చౌరస్తా కేంద్రంగా దీక్షా దివాస్ సభ గ్రాండ్ గా నిర్వహించాలని ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం వల్లే.. నిజమాబాద్ రైతు గర్జన సభ వాయిదా పడిందనే చర్చ జరుగుతోంది.
నిజమాబాద్ లో కేటీఆర్ రైతు గర్జన సభ వాయిదా పడటం తో.. మళ్ళీ సభ ఎప్పుడూ ఉంటుందనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఐతే ఇందూరు సభ కు పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారట. ఆ పార్టీకి కంచు కోటగా ఉన్న ఇందూరు లో పార్టీకి పూర్వ వైభవం కోసం స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా గులాబీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, బీజేపీ బల పడుతుండటం, పీసీసీ అధ్యక్షుడు సొంత జిల్లాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని లక్ష్యం తో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం సాగింది. ఈ మేరకు కేటీఆర్ రైతు గర్జన సభ స్థానంలో గులాబీ అధినేత నిజామాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే సభ డిసెంబర్ తేదీ ఇంకా ఖరారు కాలేదట. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోనే ఈ సభ ఉండేలా నేతలు ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ నెలలో… సభ ఉంటుందని చర్చించుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.
మొత్తానికి నేతల మధ్య అండ్స్టాండింగ్ లేక కేటీఆర్ సభ వాయిదాపడటంపై పార్టీలో వాడివేడి చర్చ జరుగుతోంది. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ సభపై అందరి ఫోకస్ పడింది. ఈ సభపైన అయినా విభేదాలు మరిచి అందరూ దృష్టిపెట్టాలని హైకమాండ్ ఆదేశాలు ఇచ్చిందట.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
-
Kishan Reddy : డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం
-
CM Chandrababu: కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు వర్చువల్ భేటీ.. తక్షణ సాయానికి విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!