MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni IPL Retirement Reason: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కెరీర్‌కు కూడా ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ 2027 నుంచి సీఎస్కే మెంటార్‌గా ధోనీ కొనసాగనున్నాడు. తాజాగా ధోనీ రిటైర్మెంట్పై అతడి మాజీ సహచరుడు, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా స్పందించాడు. ఆటగాడిగా మరికొంతకాలం కొనసాగాలని ధోనీ ఎంతో ప్రయత్నించాడని, కానీ అతడి శరీరం అందుకు సహకరించలేదని తెలిపాడు. మోకాళ్ల సమస్యల కారణంగానే ధోనీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని రైనా వెల్లడించాడు.
మోకాళ్ల సమస్య కారణంగానే:
ఎంఎస్ ధోనీకి కొంతకాలంగా మోకాళ్ల సమస్యలు వేధిస్తున్నాయని సురేష్ రైనా చెప్పాడు. ఐపీఎల్ 2026లోనూ అతడు పూర్తి సీజన్ ఆడేందుకు ఫిట్‌గా లేడని గుర్తుచేశాడు. జియోస్టార్‌తో రైనా మాట్లాడుతూ.. ‘మహీ భాయ్ ఆఫ్‌సీజన్‌లో వివిధ క్రీడలు ఆడేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ కొంతకాలంగా మోకాళ్ల సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం రెండు మోకాళ్లలోనూ వాపు ఉంది. ఇన్నేళ్లుగా వికెట్ కీపింగ్ చేయడం, ఎన్నో మ్యాచ్‌లు ఆడటం వల్ల శరీరంపై ఒత్తిడి పడింది. తిరిగి ఫిట్‌గా మారగలనని భావించి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. జిమ్‌లో చాలా కష్టపడ్డాడు. అయినప్పటికీ మోకాళ్ల వాపు సమస్య తగ్గలేదు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాలని ఎప్పుడూ కోరుకోలేదని ధోనీ తన ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు. ఇది అతడి నాయకత్వ లక్షణాలకు, ధైర్యానికి నిదర్శనం. ధోనీ ఆటను కొనసాగించాలని అనుకున్నాడు కానీ.. శరీరం ఇక ఆ భారాన్ని మోయలేకపోతోంది’ అని చెప్పాడు.
Also Read
- Mohamed Siraj Dropped: సిరాజ్‌ను అందుకే పక్కన పెట్టాం?.. అసలు విషయం చెప్పిన కెప్టెన్ గిల్!
- Jasprit Bumrah Bowling: బుమ్రా మ్యాజిక్ బాల్.. నోరెళ్లబెట్టిన కివీస్ కెప్టెన్.. వీడియో చూడాల్సిందే!
- Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్... టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
ఐపీఎల్లో ధోనీనే అతిపెద్ద బ్రాండ్:
ఐపీఎల్లో ఎంఎస్ ధోనీకి ఉన్న ప్రత్యేక గుర్తింపును కూడా సురేష్ రైనా ప్రస్తావించాడు. ‘ఐపీఎల్లో ధోనీనే అతిపెద్ద బ్రాండ్. సీఎస్కే కోసం, ఐపీఎల్ కోసం ధోనీ ఎంతో చేశాడు. అభిమానులు, వ్యాపారవేత్తలు, సీఈఓలు, 2008 నుంచి అతడిని చూస్తూ పెరిగిన యువత నుంచి ధోనీకి అపారమైన ప్రేమ లభించింది. సీఎస్కే ఇన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగడానికి ధోనీ నాయకత్వం, అభిమానుల మద్దతు ప్రధాన కారణాలు. ముఖ్యంగా విజిల్ పోడు ఆర్మీగా గుర్తింపు పొందిన సీఎస్కే అభిమానుల అండతో పాటు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో కలిసి ధోనీ జట్టును విజయవంతంగా నడిపించాడు. ఆటగాడిగా, మనిషిగా ధోనీ అద్భుతంగా రాణించాడు. ఇన్నేళ్లుగా ఐపీఎల్లో ఆడుతూ అతిపెద్ద ఆటగాడిగా ఎదిగాడు. అయితే ఒక మనిషిగా అతడి నుంచి మనం నేర్చుకున్న విషయాలు ఇంకా విలువైనవి. ఐపీఎల్లో మహీ సాధించిన విజయాల కంటే.. అతడి వ్యక్తిత్వం, ప్రవర్తన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎంతో గొప్పవి’ అని రైనా ప్రశంసించాడు.
2008లో మొదలైన అనుబంధం:
మోకాళ్ల సమస్యల కారణంగా ఎంఎస్ ధోనీ ఆటగాడిగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చిందని సురేష్ రైనా స్పష్టం చేశాడు. ఆటను కొనసాగించాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ.. శరీరం సహకరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు. ఇకపై సీఎస్కే మెంటార్‌గా ధోనీ జట్టుతో కొనసాగనున్నాడు. ధోనీ, చెన్నై అనుబంధం 2008లో మొదలైంది. తొలి ఐపీఎల్ వేలంలో ఎన్. శ్రీనివాసన్ 1.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తన కెప్టెన్సీలో సీఎస్కేకు 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో ఐదు టైటిళ్లు అందించాడు. మహీ తన ఐపీఎల్ కెరీర్లో 278 మ్యాచ్‌లు ఆడి.. 5,439 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
Mohamed Siraj Dropped: సిరాజ్‌ను అందుకే పక్కన పెట్టాం?.. అసలు విషయం చెప్పిన కెప్టెన్ గిల్!
-
International Men’s Day: “నువ్వు మగాడివి.. ఏడవకూడదు”.. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
-
Gold and Silver Prices: కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. మరోసారి భారీగా బంగారం, వెండి ధరల పతనం..
-
Jasprit Bumrah Bowling: బుమ్రా మ్యాజిక్ బాల్.. నోరెళ్లబెట్టిన కివీస్ కెప్టెన్.. వీడియో చూడాల్సిందే!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..