ENE Repeat: సత్యకు గట్టి పోటీ.. ‘ఈఎన్ఈ రిపీట్’తో లీగ్ `లోకి అభినవ్ గోమఠం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్రస్తుతం యంగ్ కమెడియన్ల హవా నడుస్తోంది. ముఖ్యంగా తనదైన బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌తో సత్య ఇప్పటికే సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కామెడీలోనే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అయితే ఇప్పుడు సత్య రేంజ్లో ప్రేక్షకులను అలరించడానికి మరో టాలెంటెడ్ నటుడు దూసుకొస్తున్నాడు. అతనే అభినవ్ గోమఠం. కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో కౌశిక్ పాత్రలో అభినవ్ సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన మార్క్ చూపించినా, ఇప్పుడు సీక్వెల్‌గా వస్తున్న ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE 2) మాత్రం అభినవ్ కెరీర్‌ను మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు అభినవ్ గోమఠం సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారాడు. నిజానికి ఈ సీక్వెల్‌కు అతనే అసలైన స్టార్ అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కమెడియన్ అనగానే సత్య పేరే ముందుగా వినిపిస్తుంది. ఏ సినిమాలో ఉన్నా తన మార్క్ కామెడీతో ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సత్తా సత్యకు ఉంది. ఇప్పుడు ‘ఈఎన్ఈ రిపీట్’ క్రేజ్ చూస్తుంటే, అభినవ్ గోమఠం కూడా అదే ప్రామిసింగ్ కమెడియన్స్ లీగ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది..అభినవ్ పలికే డైలాగ్ డెలివరీ, పక్కా లోకల్ యాస యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి..సీక్వెల్లో మిగతా పాత్రల కంటే అభినవ్ పాత్రకే ఎక్కువ స్కోప్, కామెడీ వర్కౌట్ అయింది. మొత్తానికి సత్య తర్వాత ఆ స్థాయిలో ఆడియన్స్‌ను నవ్వించే సత్తా ఉన్న కమెడియన్‌గా అభినవ్ గోమఠం నిలదొక్కుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ‘ఈఎన్ఈ రిపీట్’ విడుదల తర్వాత టాలీవుడ్ కామెడీ లెక్కలు మారడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు!
- Suriya Scene: సూర్య 'సీన్' సినిమా కాపీనా.. డిట్టో దింపేశారా?
- Aditya Dhar: రణ్వీర్ సింగ్‌తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
- Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు కింగ్ నాగార్జున మద్దతు..
తాజావార్తలు
-
ENE Repeat: సత్యకు గట్టి పోటీ.. ‘ఈఎన్ఈ రిపీట్’తో లీగ్ `లోకి అభినవ్ గోమఠం
-
Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు!
-
TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
-
Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
-
Uttam Kumar Reddy : జలవాటాలో ఒక్క చుక్కా వదులుకోం.. ఏపీ యత్నాలను అడ్డుకుంటాం
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!