Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saif Ali Khan Death Threat: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. 2024లో రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడు, ప్రస్తుతం పరారీలో ఉన్న జీషాన్ అక్తర్ పేరుతో సైఫ్‌కు హత్య బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ బెదిరింపుల వెనుక నిజంగా అక్తర్ ఉన్నాడా? లేదా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, పోలీసు దర్యాప్తు సంస్థలను ఇబ్బంది పెట్టేందుకు మరెవరైనా అతడి పేరును ఉపయోగిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవల బాలీవుడ్ నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ రెండు ఘటనల్లోనూ బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల ఐఐటీ గ్రాడ్యుయేట్ వైభవ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఎలాంటి క్రిమినల్ గ్యాంగ్‌తో సంబంధాలు లేవని, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో బెదిరింపులకు పాలపడినట్లు అధికారులు వెల్లడించారు. తాజా బెదిరింపులపై సైఫ్ అలీఖాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజా బెదిరింపుల నేపథ్యంలో 2025 జనవరి 16న సైఫ్‌పై జరిగిన దాడి ఘటన మరోసారి చర్చకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన నివాసంలోకి తెల్లవారుజామున ఓ దుండగుడు చొరబడ్డాడు. సుమారు రాత్రి 2 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. సైఫ్, కరీనా కపూర్ చిన్న కుమారుడు జెహ్ గదికి వెళ్లినట్లు సమాచారం.
Also Read
- Suriya Scene: సూర్య 'సీన్' సినిమా కాపీనా.. డిట్టో దింపేశారా?
- Aditya Dhar: రణ్వీర్ సింగ్‌తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
- Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు కింగ్ నాగార్జున మద్దతు..
- January 12 Vidudala: ప్రమోషన్స్ అంటే చాలు వచ్చేస్తాడు.. అనిల్ రావిపూడిపై కృతి, కీర్తి సెటైర్లు!
కుమారుడిని కాపాడేందుకు సైఫ్ ఆ దుండగుడిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అతడు సైఫ్‌పై పలుమార్లు కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ మెడ, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు సుమారు ఆరు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఐదు రోజుల చికిత్స అనంతరం సైఫ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటన తర్వాత ఎదురైన భయానక పరిస్థితులను కరీనా గతంలో గుర్తుచేసుకున్నారు. ఈ ఘటన తమ కుటుంబంపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందని, దాదాపు ఆరు నెలల పాటు సరిగా నిద్రపోలేకపోయానని చెప్పారు. ఇటీవల కరణ్ జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 9’లోనూ ఈ ఘటనకు సంబంధించిన అనుభవాలను ఈ దంపతులు గుర్తుచేసుకున్నారు.
తాజావార్తలు
-
Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్‌కు మరోసారి బెదిరింపులు!
-
TVK MLA V.S. Babu: ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత..
-
Jairam Ramesh: నోట్లబందీ, ఓట్లబందీ ఒకే నాణేనికి రెండు వైపులు.. జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు..
-
Uttam Kumar Reddy : జలవాటాలో ఒక్క చుక్కా వదులుకోం.. ఏపీ యత్నాలను అడ్డుకుంటాం
-
History of Weekdays: ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకు వస్తుంది? ఈ 24 గంటల ఖగోళ లెక్క తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!