Ramanaidu Studio Lands: విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ఆదేశాలతో సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు.
Visakhapatnam: విశాఖపట్నంలో స్కూల్ విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ పిల్లల ప్రాణాలని మద్యానికి పణంగా పెట్టాడు ఆటో డ్రైవర్.. మద్యం మత్తులో స్కూల్ ఆటో డ్రైవర్ డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది.
Visakha Mayor: గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది.
విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ గా మార్చుతాం.. విశాఖ రీజియన్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు మంత్రి నారా లోకేష్.. ఆర్థిక వృద్ధిలో విశాఖను దేశంలోనే ఐదవ స్థానంలో నిలపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన.. విశాఖను ఒక బ్రాండ్ గా మార్చుతాం.. విశాఖలో 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టం చేశారు..
Visakhapatnam: రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బి అక్షయ్ కుమార్.. ఆమెతో తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించి 4 కోట్ల రూపాయల నగదుతో పాటు 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు.
Vizag: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడని కోపంతో రగిలిపోయిన యువతి.. ఆ కోపంతో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన 14 వాహనాలను దగ్ధం చేసింది.
GVMC Budget: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మేయర్ పై అవిశ్వాసం నోటీసులతో రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది.
భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.. భీమిలి అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు..