సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు మృతిచెందారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు.
క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25లక్షల చొప్పున సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.3లక్షల పరిహారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Nagachithanya : నాగచైతన్య-శోభితపై ఆ రూమర్లు.. అంతా ఫేకేనా..?
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదిలా ఉంటే మరికాసేపట్లో సీఎం చంద్రబాబు విశాఖ వెళ్లే అవకాశం ఉంది. కేజీహెచ్‌లో మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చనున్నారు. అలాగే క్షతగాత్రులను కూడా పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Varun Tej : డిజాస్టర్ దర్శకుడితో మెగా ప్రిన్స్ సినిమా.?