Adulterated food: పర్యాటక నగరంగా పేరుగాంచిన విశాఖపట్నంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేరుకు మాత్రమే హంగులతో ఆకర్షిస్తూ, లోపల మాత్రం రోజుల తరబడి నిల్వ ఉంచిన పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నారు.
విశాఖలో ఓ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ వార్తల్లోకి ఎక్కింది. ప్రేమించిన యువతి కోసం ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు. ప్రేమ, ప్రేయసి కోసం చాకుతో దాడికి పాల్పడి హత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. విశాఖ 3 టౌన్ పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బోగాపురానికి చెందిన సూర్య, చైతన్య ఇద్దరు కాలేజ్ మెట్స్. వీరిద్దరి మధ్య రెండున్నరేళ్లగా ప్రేమ వ్యవహారం నడిచింది. 5 ఏళ్ళ…
CII Partnership Summit 2025: విశాఖ వేదికగా జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు రోజుల పాటు జరిగే ఈసదస్సు కోసం విశాఖ సాగర తీరం ముస్తాబు అయింది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3 వేల…
MP Bharat: ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడం.. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు విశాఖ ఎంపీ శ్రీభరత్.. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆయన మాట్లాడుతూ.. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. పెట్టుబడుల సదస్సు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. సుమారు రూ.9.8 లక్షల కోట్లు విలువైన MoUs చేసుకునే అవకాశం ఉందన్నారు.. విశాఖలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం…
Konda Rajiv Gandhi: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీశ్ గాంధీ.. చంద్రబాబుది టార్చ్ లైట్ పాలనైతే.. జగన్ ది టార్చ్ బేరర్ పాలన అని పేర్కొన్నారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీధిలైటు వెలగకపోతే తనకు తెలుస్తుందన్న చంద్రబాబుకు కేజీహెచ్ లో 12 గంటలు కరెంటు లేదన్న విషయం ఎందుకు తెలియ లేదు..? అని ప్రశ్నించారు.. పేదల ఆరోగ్యం మీద ప్రభుత్వానికి బాధ్యత…
Minister Nara Lokesh: ప్రభుత్వం.. ప్రజలు కలిస్తేనే… సీఐఐ సదస్సు అన్నారు మంత్రి నారా లోకేష్.. నిన్న మహిళా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లిన ఆయన.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా చాలా మంది పారిశ్రామిక వేత్తలను కలిశాను. ఏపీలో ఏదో మ్యాజిక్ జరుగుతోంది అంటున్నారు.. గూగుల్ ఏపీకి తీసుకెళ్లారు..? ఎలా సాధ్యం..? అని అడిగారని తెలిపారు.. మా హయాంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు…
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు మంత్రి నారా లోకేష్.. వైజాగ్లో త్వరలో సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం.. పెట్టుబడులే ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరుగుతుంది.. సీఐఐ సదస్సుల్లో 48 సెషన్స్ జరుగుతాయి.. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి.. 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందన్నారు లోకేష్.. 16 నెలల్లో రూ.10లక్షల కోట్ల…
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 రోజులుగా అతలాకుతలం అయిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఓ పక్కా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి.. మరో వైపు వైసీపీ హయాంలోని వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. గూగుల్ డేటా సెంటర్ తో నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు.
Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒకటి యలమంచిలి. ఇక్కడ కాపు, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ. గతంలో లేకున్నా… ఓట్ బ్యాంక్ ఆధారంగా ఇక్కడ పోటీ చేసేందుకు కాపు నేతలు ఆరాటపడటం దశాబ్ద కాలంగా కనిపిస్తోంది. జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సహా ఎక్కువ సార్లు గెలిచింది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. దీంతో ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల వ్యూహాలు కాపుల…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడం.. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, కల్పించే వసతులపై వివరిస్తూ.. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా దిగ్గజ సంస్థలను ఆహ్వానిస్తున్నారు.. ఇక, మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధం అయ్యారు సీఎం చంద్రబాబు.. వచ్చే నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు…