Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
- శ్రీరామ నవమి ప్రత్యేక నైవేద్యం – పానకానికి ఉన్న ప్రాధాన్యం
- బెల్లం, మిరియాలు, యాలకులతో అసలైన సంప్రదాయ రుచి
- 5 నిమిషాల్లో ఇంట్లోనే పానకం తయారీ విధానం
- వేసవిలో తక్షణ శక్తి, వడదెబ్బకు సహజ రక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panakam Recipe in telugu: తెలుగు వారి పండుగల్లో శ్రీరామ నవమికి ఒక ప్రత్యేకత ఉంది. ఎండలు ముదురుతున్న సమయంలో వచ్చే ఈ పండుగ నాడు రాముడికి నైవేద్యంగా పానకాన్ని సమర్పిస్తారు. మన పూర్వీకులు పండుగ ప్రసాదంగా పానకాన్ని ఎంచుకోవడం వెనుక గొప్ప శాస్త్రీయ కారణం ఉంది. బెల్లం, మిరియాలు, ఇలాచీలతో తయారయ్యే ఈ పానకం వేసవిలో వచ్చే అలసటను దూరం చేసి, తక్షణ శక్తిని అందిస్తుంది. మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ కంటే ఎంతో మేలైన ఈ పానకాన్ని అసలైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Emraan Hashmi: ‘నో కిస్’ పాలసీకి బ్రేక్..దిశా పటానీతో ఇమ్రాన్ హష్మీ ఇంటిమేట్ సీన్స్
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
కావలసిన పదార్థాలు
పానకం తయారీకి మన వంటింట్లో ఉండే సామాగ్రి సరిపోతుంది. అర లీటరు నీరు, అర కప్పు తురిమిన బెల్లం, ఒక టీస్పూన్ మిరియాల పొడి, అర టీస్పూన్ ఇలాచీ (యాలకుల) పొడి, చిటికెడు పచ్చకర్పూరం (ఆప్షనల్), , కొన్ని తులసి ఆకులు సిద్ధం చేసుకోవాలి.
తయారీ విధానం
ముందుగా ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, ఆ నీటిని వేరొక పాత్రలోకి వడకట్టుకోవాలి (దీనివల్ల బెల్లంలోని నలకలు తొలగిపోతాయి). ఇప్పుడు ఆ బెల్లం నీటిలో మిరియాల పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పానకానికి మంచి సువాసన రావాలంటే కొద్దిగా పచ్చకర్పూరం , తులసి ఆకులను వేయాలి. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా సొంఠి పొడిని కూడా చేర్చుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పానకం సిద్ధం!
ఆరోగ్య ప్రయోజనాలు
పానకంలో వాడే ప్రతి వస్తువులోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. బెల్లం శరీరానికి ఐరన్ , తక్షణ శక్తిని ఇస్తుంది. మిరియాలు , సొంఠి పొడి వేసవిలో వచ్చే గొంతు సమస్యలను, జలుబును నివారిస్తాయి. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఎండ తీవ్రత వల్ల కలిగే వడదెబ్బ నుంచి పానకం రక్షణ కల్పిస్తుంది. ఈ పానకాన్ని మట్టి పాత్రలో ఉంచి సేవిస్తే మరింత చలవ చేస్తుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!