YSRCP: విశాఖ మేయర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్..! వారిపై వైసీపీ ఫిర్యాదు
- గ్రేటర్ విశాఖ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం..
- ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన వైసీపీ..
- పార్టీ బీ ఫాంపై గెలిచి కూటమికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీఠాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకున్నాయి.. ఇక, త్వరలోనే డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది.. అయితే, మేయర్ ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తమ పార్టీ బీ ఫాంపై గెలిచి కూటమికి అనుకూలంగా ఓటేసిన కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.. వైసీపీ సభ్యులకు విప్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను ఎన్నికల అధికారికి అందజేశారు ఆ పార్టీ నేతలు తైనాల విజయ్ కుమార్, పల్లా దుర్గా రావు.. అవిశ్వాసానికి ఎవరు అనుకూలంగా ఓటు వేశారు…? వ్యతిరేకంగా ఓటీ వేశారో…? తమకు తెలియజేయాలని కోరారు వైసీపీ నేతలు.. అంతేకాదు.. పార్టీ విప్‌ను ధిక్కరిస్తూ.. వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేసేందుకు న్యాయ పరమైన చర్యలు ప్రారంభించే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు..
Read Also: Smita Sabharwal: గచ్చిబౌలి పోలీసుల నోటీసులకి ఐఏఎస్ స్మితా సబర్వాల్ రియాక్షన్..
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
కాగా, ఏపీలోనే అతి పెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. మేయర్ పై పెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి.. అయితే, అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.. మరోవైపు, పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసినా వైసీపీ వ్యూహం ఫలించలేదు. ఇక, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజార్టీని కూటమి సాధించడంతో గ్రేటర్ విశాఖ పీఠం కూటమి వశం అయ్యింది.. మేయర్ అవిశ్వాసంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు.. కోరం సరిపోవడంతో సమావేశాన్ని నిర్వహించి ఓటింగ్ చేపట్టారు..
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!