Land Allotments: ఆంధ్రప్రదేశ్ లో ఫిన్ టెక్ ప్రగతి ప్రయాణం భూముల చుట్టూ తిరుగుతోంది. విశాఖలో అత్యంత ఖరీదైన భూములను 99పైసల లీజుకు కేటాయించడం తీవ్ర చర్చ నీయాంశంగా మారుతోంది. ఐటీ అభివృద్ధి, ఏకో సిస్టమ్ కోసం ప్రభుత్వం సంకల్పంకు ఈ నిర్ణయం ఉదాహరణగా అధికారపార్టీ సమర్ధించుకుంటుంటే.. భూ పందేరాల వెనుక రహస్య అజెండా ఉందని ప్రతిపక్షం అనుమానం వ్యక్తం చేస్తోంది.
Read Also: Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు!
విశాఖలో ఎంత మారుమూలకు వెళ్లిన ఎకరం భూమి విలువ కోటి రూపాయలకు తక్కువ ఉండదు. లక్షల్లో దొరికితే లక్కీ చాన్స్ .. అటువంటిది 99పైసలకే లభిస్తే బంపర్ ఆఫర్ కిందే లెక్క. సరిగ్గా ఏపీ సర్కార్ ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకుని ఐటీ పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతోంది. మొన్న టీసీఎస్., ఆ తర్వాత ‘ఉర్సా’ ఇలా ఒక్కొక్కటిగా సాఫ్ట్వేర్ కంపెనీలకు అడిగిందే తడవుగా భారీ భూ కేటాయింపులు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐతే, ఇదేమీ కొత్త విధానం కాదని పెట్టుబడులను ఆకర్షించేందుకు గుజరాత్ వంటి రాష్ట్రాలు ఎప్పుడో అమలు చేసి సక్సెస్ అవ్వడాన్ని ఉదాహరణగా చూపిస్తోంది. విశాఖను ఐటీ డెస్టినేషన్ గా తీర్చిదిద్దే ప్రయత్నం రెండు దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ ఆశించిన స్థాయిలో సాధ్యం కాలేదు. రుషికొండ ఐటీ సెజ్ పరిధిలోని హిల్ నెంబర్ 1,2,3తో పాటు నగరంలో ప్రముఖ ప్రాంగణాల్లో సాఫ్ట్వేర్ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్ జరుగుతుండగా.. దానిని 40 వేల కోట్లకు పెంచాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఈ దిశగా ఐటీ పాలసీని అనుసరించి పెట్టుబడులతో వచ్చే సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ కంపెనీTCS భారీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కోసం ముందుకు వచ్చింది.
Read Also: Pahalgam Terror Attack: పాకిస్తాన్ కు వ్యతిరేకంగా “భారత్ దౌత్యపరమైన దాడి”..
1370కోట్ల రూపాయల పెట్టుబడులతో అభివృద్ధి కేంద్రం ఏర్పాటు ద్వారా 12వేల మందికి అవకాశాలు మెరుగుపడతాయని అంచనాలు వున్నాయి. ఇందు కోసం 99పైసల లీజు చొప్పున ఐటీ హిల్ 3 మీద 21.16ఎకరాలను కేటాయించింది. సెజ్ పరిధిలో ఉన్న మిలీనియం టవర్స్ ను డీ నోటిఫై చేసింది. ఇక్కడ TCS తాత్కాలిక కార్యకలపాలు ప్రారంభించినుంది. అలాగే, ఉర్సా కంపెనీ కోసం సుమారు 60ఎకరాలు కేటాయించేందుకు ఆమోదం లభించడం విమర్శలకు కారణం అయింది. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టాటా మోటార్స్‌కు 99 పైసలకే భూమిని కేటాయించిన విధానాన్నే చంద్రబాబు ప్రభుత్వం కూడా అనుసరించి నట్టు కూటమి పార్టీలు చెబుతున్నాయి. మోదీ తీసుకున్న నిర్ణయం గుజరాత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడింది. ఇప్పుడు ఏపీ సర్కార్ చర్య విశాఖపట్నాన్ని ఒక ప్రధాన ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ పెట్టుబడులను ఆకర్షించడంలో తీవ్రంగా ఉందని, పరిశ్రమకు సంకేతం ఇవ్వడానికి ఇది సాహసోపేతమైన నిర్ణయం చెబుతున్నారు. 99పైసల కే భూ కేటాయింపులపై రాజకీయ ఆలోచనలు ఎలా ఉన్నా ఐటీ అభివృద్ధి ప్రణాళికలో కీలకం అనేది ఇండస్ట్రీ వర్గాలు ఆలోచన.