Stomach Pain After Eating: తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!
- తిన్న వెంటనే కడుపు నొప్పి – సాధారణ కారణాలేమిటి?
- అజీర్ణం, గ్యాస్ట్రైటిస్ నుంచి ఫుడ్ ఇన్‌టాలరెన్స్ వరకు
- అల్సర్లు, గాల్‌స్టోన్స్, IBS వంటి తీవ్రమైన సమస్యల సంకేతాలు
- ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? హెచ్చరిక లక్షణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Experiencing stomach pain after eating? : చాలామంది భోజనం చేసిన తర్వాత కడుపులో నొప్పి లేదా మంటగా అనిపిస్తే “ఏదో గ్యాస్ సమస్యలే” అని లైట్ తీసుకుంటారు. కానీ, ఆహారం తీసుకున్న తర్వాత వచ్చే ప్రతి నొప్పి సాధారణ జీర్ణక్రియ లోపం కాకపోవచ్చు. మన శరీరం ఇచ్చే కొన్ని హెచ్చరిక సంకేతాలను సకాలంలో గుర్తించకపోతే, అవి భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఆహారం తిన్న తర్వాత కడుపు నొప్పి రావడానికి గల ప్రధాన కారణాలు , ఆ పరిస్థితి ఎప్పుడు సీరియస్ అవుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
నొప్పికి దారితీసే సాధారణ కారణాలు
ఆహారం తిన్న వెంటనే నొప్పి రావడానికి అజీర్ణం (Indigestion) లేదా గ్యాస్ట్రైటిస్ ప్రధాన కారణం కావచ్చు. మనం అతిగా తినడం, మసాలా దట్టించిన ఆహారం తీసుకోవడం లేదా తిన్న వెంటనే పడుకోవడం వల్ల కడుపులో యాసిడ్స్ పైకి తన్ని నొప్పి లేదా మంటను కలిగిస్తాయి. అలాగే, ఫుడ్ ఇన్ టాలరెన్స్ (కొన్ని రకాల ఆహారాలు పడకపోవడం) కూడా ఒక కారణం కావచ్చు. ఉదాహరణకు, కొందరికి పాలు లేదా గ్లూటెన్ ఉన్న ఆహారం తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, నొప్పి వస్తుంది. వీటితో పాటు మలబద్ధకం కూడా పేగులపై ఒత్తిడిని పెంచి నొప్పికి దారితీస్తుంది.
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
Emraan Hashmi: ‘నో కిస్’ పాలసీకి బ్రేక్..దిశా పటానీతో ఇమ్రాన్ హష్మీ ఇంటిమేట్ సీన్స్
తీవ్రమైన పరిస్థితులు..
అల్సర్లు: నొప్పి అడపాదడపా కాకుండా ప్రతిరోజూ వస్తుంటే, అది లోపల ఏదో పెద్ద సమస్య ఉందని అర్థం. కడుపులో లేదా పేగుల్లో పుండ్లు (Ulcers) ఉన్నప్పుడు, ఆహారం వాటికి తగలగానే తీవ్రమైన మంట లేదా నొప్పి వస్తుంది.
పిత్తాశయంలో రాళ్లు (Gallstones): ముఖ్యంగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తిన్న తర్వాత కడుపుకు కుడి వైపు పైభాగంలో నొప్పి వస్తుంటే అది గాల్‌బ్లాడర్ స్టోన్స్‌కు సంకేతం కావచ్చు.
ఐబీఎస్ (IBS): ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉన్నవారికి తిన్న తర్వాత కడుపులో తిమ్మిర్లు, నొప్పి , విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.
ప్యాంక్రియాటైటిస్: ప్యాంక్రియాస్ వాపు ఉన్నప్పుడు కూడా భోజనం తర్వాత నొప్పి వెన్నుముక వరకు పాకుతుంది.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
సాధారణ గ్యాస్ నొప్పి అయితే కాసేపటికి తగ్గిపోతుంది. కానీ, కడుపు నొప్పితో పాటు జ్వరం రావడం, వాంతులు అవ్వడం, మలంలో రక్తం పడటం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. అలాగే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా అది ఎమర్జెన్సీ కండిషన్ అని గుర్తించాలి.
కడుపు నొప్పి అనేది ఒక లక్షణం మాత్రమే, వ్యాధి కాదు. సరైన సమయంలో దానికి కారణమేంటో తెలుసుకుంటే చికిత్స సులభం అవుతుంది. సమయానికి భోజనం చేయడం, నీరు ఎక్కువగా తాగడం , ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా చాలా వరకు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు.
Emraan Hashmi: ‘నో కిస్’ పాలసీకి బ్రేక్..దిశా పటానీతో ఇమ్రాన్ హష్మీ ఇంటిమేట్ సీన్స్
తాజావార్తలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!