జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోమంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే చంద్రమౌళి కుటుంబ సభ్యులు పహల్గాం బయల్దేరివెళ్లారు.
Also Read: AP SSC Results 2025: విద్యార్థులకు అలెర్ట్.. నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల!
పహల్గాం ఉగ్రదాడిలో హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్ రంజన్ మృతి చెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, ఇద్దరు పిల్లల ముందే ఆయన్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మనీశ్‌ను విచక్షణారహితంగా చంపిన ఉగ్రవాదులు.. కుటుంబ సభ్యులను మాత్రం విడిచిపెట్టారు. బిహార్‌కు చెందిన మనీశ్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.