మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలి అన్నారు సీఎం చంద్రబాబు.. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డే ను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారు.
నకిలీ ఏసీబీ అధికారి కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.. నకిలీ ఏసీబీ అధికారి కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. నకిలీ ఏసీబీ వెనుక కిలాడీ లేడీ ఖాకీ ఉన్నట్టుగా చెబుతన్నారు అధికారులు..
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై వేగంగా ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూ కి కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్.
Crime News: గ్రేటర్ విశాఖపట్నం నగర శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని మృతదేహలు కలకలం రేపుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు స్థానిక ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.
సింహాచలం దేవస్థానంలో జరిగిన దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. దుర్ఘటనపై తేల్చేందుకు ఎంక్వైరీ కమిషన్‌ను నియమించింది.. ఎంక్వైరీ కమిషన్ ఛైర్మన్ గా ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్, సభ్యులుగా ఐజీ ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావును నియమించిన ప్రభుత్వం.. ఈ ఘటనపై 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది..
విశాఖ జిల్లా సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సింహాచలం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని విమర్శించారు.. ఆరు రోజుల కిందట గోడ నిర్మాణం చేపట్టి రెండు రోజుల కిందట పూర్తి చేశారు.. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా ? చందనోత్సవానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు..
విశాఖలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే సింహాచలం అప్పన్న సన్నిధిలో భారీగా భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కొండ దిగువున బస్సులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు భక్తులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇక సంఘటనాస్థలిని మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.