Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!
- దాహం మాత్రమే కాదు… డీహైడ్రేషన్‌కు ఇవీ ప్రారంభ హెచ్చరికలు
- మూత్రం రంగు మారిందా? జాగ్రత్తగా గమనించాల్సిన సంకేతం
- తలనొప్పి, తల తిరగడం… శరీరం పంపే ఎమర్జెన్సీ సిగ్నల్స్
- ఎండాకాలంలో తప్పనిసరిగా పాటించాల్సిన హైడ్రేషన్ టిప్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎండలు తీవ్రమవుతున్న వేళ మన శరీరం చెమట రూపంలో అధికంగా నీటిని , లవణాలను కోల్పోతుంది. మనం కోల్పోయిన నీటిని తిరిగి అందించకపోతే డీహైడ్రేషన్ బారిన పడతాం. చాలామంది దాహం వేసే వరకు నీరు తాగరు, కానీ దాహం వేయడమే డీహైడ్రేషన్ ప్రారంభమైందని చెప్పే మొదటి సంకేతం. శరీరంలో నీటి శాతం తగ్గిందని తెలిపే ఇతర ముఖ్యమైన లక్షణాలను డాక్టర్ సునీల్ బోహ్రా వివరించారు.
డీహైడ్రేషన్‌ను గుర్తించే ముఖ్య లక్షణాలు
శరీరంలో నీరు తగ్గినప్పుడు కనిపించే మొదటి లక్షణం నోరు , గొంతు ఎండిపోవడం. అలాగే, మూత్రం రంగులో మార్పు రావడం మరో ప్రధాన సంకేతం. మూత్రం ముదురు పసుపు రంగులో వస్తున్నా లేదా మూత్ర విసర్జన తగ్గిపోయినా శరీరం నీటి కోసం అలమటిస్తుందని అర్థం చేసుకోవాలి. వీటితో పాటు అకస్మాత్తుగా తల తిరగడం, నీరసం, , విపరీతమైన తలనొప్పి రావడం కూడా డీహైడ్రేషన్ లక్షణాలే. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతినడం వల్ల కండరాల తిమ్మిర్లు (Muscle Cramps) కూడా వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
7-Seater Cars: 7-సీటర్ కార్లు కావాలా? ఎర్టిగా నుండి బొలెరో వరకు.. ఫ్యామిలీ కార్లపై ఓ లుక్కేయండి
తీవ్రమైన పరిస్థితులు , సంకేతాలు
డీహైడ్రేషన్ తీవ్రత పెరిగినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం (Palpitations) , రక్తపోటు పడిపోవడం జరుగుతుంది. చర్మం తన స్థితిస్థాపకతను కోల్పోతుంది; అంటే చర్మాన్ని గిచ్చినప్పుడు అది వెంటనే యథాస్థితికి రాకపోతే నీటి శాతం బాగా తగ్గిందని గుర్తించాలి. విపరీతమైన ఆకలి వేయడం లేదా చిరాకు కలగడం కూడా డీహైడ్రేషన్ వల్ల కలిగే మానసిక మార్పులు. ముఖ్యంగా వృద్ధులు , చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం అందించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డీహైడ్రేషన్ నుండి తప్పించుకోవడానికి దాహం వేసినా వేయకపోయినా రోజూ 3-4 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కేవలం మంచినీరు మాత్రమే కాకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం, సోడియం వంటి లవణాలు అందుతాయి. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో (మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు) వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం.
APSRTC: దివ్యాంగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎస్కార్ట్‌కు 50 శాతం రాయితీ..
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!