Nepal Elections: “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా నేపాల్‌లో ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Elections: హింసాత్మక “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా హిమాలయ దేశం నేపాల్‌లో ఈరోజు ఎన్నికలు జరుగనున్నాయి. గతేడాది సెప్టెంబర్లో యువత ఆందోళన మధ్య అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఈ ఆందోళనల సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది చనిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. రెండు రోజుల నిరసనల్లో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ రాజకీయ చరిత్రలో అత్యంత హింసాత్మక ఘటనల్లో ఒకటిగా ఈ ఆందోళనలు నిలిచాయి.
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
మార్చి 5న జరుగుతున్న ఈ ఎన్నికల్లో అక్కడి ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారు. మొత్తం 3 కోట్ల నేపాల్ జనాభాలో 1.9 కోట్ల మంది ఓటర్లు తమ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం 3 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. మొత్తం 275 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) [CPN (MC)], నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్-మార్క్సిస్ట్ లెనినిస్ట్) [CPN (UML)], షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ (NC)లు మరోసారి ఎన్నికల బరిలో నిలబడ్డాయి. గత మూడున్నర దశాబ్ధాలుగా ఈ మూడు పార్టీలే నేపాల్‌లో అధికారాన్ని నిర్వహించాయి. అయితే, ప్రతీసారి ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాలే నేపాల్‌ను శాసించాయి. అయితే, ఈసారి ఈ పార్టీతో పాటు యువనేత, నేపాల్ రాజధాని ఖాట్మాండు మేయర్‌గా ఉన్న బాలెన్ షా కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది.
తాజావార్తలు
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!