KVN Productions : కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్‌కు వరుస తలనొప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లో బడ్జెట్ సినిమాలు తీసే శాండిల్ వుడ్‌కు భారీ చిత్రాలను నిర్మించే స్థాయికి తీసుకెళ్లింది హోంబలే. ఈ ప్రొడక్షన్ హౌస్‌ను స్ఫూర్తిగా తీసుకుని డిస్ట్రిబ్యూషన్ రంగంలో నుండి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది కెవిఎన్ ప్రొడక్షన్స్. సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోలతో వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించింది.. కానీ ఏం లాభం తీసిన సినిమాలన్నీ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి హోల్డ్ అవుతున్నాయి. మొన్న జననాయగన్, నిన్న టాక్సిక్ వాయిదాల పర్వంలో నడుస్తున్నాయి.
దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటోన్న జన నాయగన్‌పై భారీగా ఖర్చు పెట్టింది కెవిన్ ప్రొడక్షన్ హౌస్. సుమారు 400 కోట్లతో నిర్మించిన ఈ బొమ్మ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా… లాస్ట్ మినిట్‌లో సెన్సార్ ఇష్యూ వల్ల పోస్ట్ పోనైంది. సుప్రీంకోర్టు వరకు చేరినా ఈ పంచాయతీ తేలలేదు. దీంతో మూవీ ఎప్పుడొస్తుందో కూడా తెలియని సిచ్యుయేషన్. ఈ ఝలక్ నుండే ప్రొడక్షన్ హౌస్ కోలుకోలేదు అనుకుంటే.. తాజాగా టాక్సిక్ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. రిలీజ్‌కు ఇంకా 15 రోజులుండగా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేసింది. పశ్చిమాసియా దేశాల్లో యుద్దం నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. యష్ టాక్సిక్‌ను 600 కోట్లతో నిర్మిస్తోంది కెవిన్ ప్రొడక్షన్ హౌస్. అయితే రీషూట్స్ వల్ల అనుకున్న దాని కన్నా బడ్జెట్ పెరిగిందన్నది శాండిల్ వుడ్ టాక్. తీరా విడుదల దగ్గరకు వచ్చేసరికి యుద్ధం సాకుగా చెప్పి పోస్ట్ పోన్ చేసింది. ఈ రెండే కాదు.. గత ఏడాదే రావాల్సిన ధ్రువ్ సర్జా కెడీ ద డెవిల్ కూడా ఎప్పుడు రిలీజౌతుందో చెప్పలేకపోతోంది. ఈ బొమ్మలన్నీ ల్యాబ్‌లకే పరిమితం కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయింది కెవిన్ సంస్థ. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే చిరంజీవి- బాబి ప్రాజెక్ట్ నుండి తప్పుకుందన్న టాక్ నడుస్తోంది. ఈ విషయం తేలాలంటే.. మార్చి 14న మూవీ ఓపెనింగ్ రోజు జరగబోతోందట.. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!