Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ తన పాటల ఎంపికలో సరికొత్త నిబంధనలను విధించుకున్నారు. 2012లో విడుదలైన ‘అగ్నిపథ్’ సినిమాలోని ‘చిక్ని చమేలి’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ పాట పాడే సమయంలో తనకు సాహిత్యం (Lyrics) లోని లోతైన అర్థాలను గ్రహించే పరిణతి లేదని ఆమె తాజాగా వెల్లడించారు. ఆ పాటలోని కొన్ని పదాలు,వాటి అర్థంపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ తనను ఆలోచింపజేసిందని ఆమె పేర్కొన్నారు.
Also Read : Spirit : ప్రభాస్- సందీప్ వంగా ‘స్పిరిట్’ షూటింగ్ అప్‌డేట్..
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
శ్రేయ మాట్లాడుతూ.. ‘ఆ పాటలో అద్భుతమైన ట్యూన్, కళాత్మకత ఉన్నాయి. అది పెద్ద హిట్ కావడాన్ని నేను గౌరవిస్తాను. కానీ, చిన్న పిల్లలు ఆ పాటలోని అర్థం తెలియకుండా పాడుతుంటే నాకు ఇబ్బందిగా అనిపించేది. కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి ఆ పాట పాడమని అడిగితే చెప్పలేని అసౌకర్యానికి గురయ్యేదాన్ని. అందుకే అప్పటి నుండి పాటలను ఎంచుకునేటప్పుడు సాహిత్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాను. ఆ తర్వాత అలాంటి ఎన్నో ఐటెం సాంగ్స్ ఆఫర్లు వచ్చినా నేను సున్నితంగా తిరస్కరించాను’ అని శ్రేయ ఘోషల్ స్పష్టం చేశారు. పాట ఎంత పెద్ద హిట్ అయినా, అది సమాజంపై.. ముఖ్యంగా పిల్లలపై చూపే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రేయ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సింగర్‌గా కేవలం ట్యూన్‌కే కాకుండా, పదాలకు కూడా విలువ ఇవ్వాలనే ఆమె ఆలోచన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!