రాష్ట్రంలో వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. మేజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేయగా ముగ్గురు జనసేనాలో చేరిపోయారు. మాజీమంత్రి అవంతి కుమార్తె ప్రియాంక సైతం కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు.
Also Read:Dilip Ghosh: 61 ఏళ్ల వయసులో మహిళా నేతను పెళ్లాడిన బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు
ఈ చేరికలు అన్నీ తమకు ప్లస్ అని భావిస్తోంది టీడీపీ. ఈ నేపథ్యంలో మలేషియా క్యాంప్ నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగొచ్చారు. వారిని రాత్రి వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు తరలించారు. ఓటింగ్ సమయంలో కార్పొరేటర్లు నేరుగా ఆఫీసుకు రానున్నారు. అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించింది. ఫ్యాన్ సింబల్ పై గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది.
Also Read:Ponnam Prabhakar : భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వీళ్ళలో 25 మంది పార్టీ ఫిరాయించగా అనర్హత వేటుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగానే అందుబాటులో ఉన్న కార్పొరేటర్లకు నేరుగాను.. క్యాంపులకు వెళ్లిపోయిన వాళ్ళ కు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసింది. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని బలంగా విశ్వశిస్తున్న వైసీపీ.. ఈ వ్యవహరం అంతా ముగిసే వరకు కార్పొరేటర్ లను క్యాంప్ లోనే కొనసాగాలని నిర్దేశించింది.