Visakhapatnam: రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బి అక్షయ్ కుమార్.. ఆమెతో తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించి 4 కోట్ల రూపాయల నగదుతో పాటు 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు.
Vizag: విశాఖపట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడని కోపంతో రగిలిపోయిన యువతి.. ఆ కోపంతో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసిన 14 వాహనాలను దగ్ధం చేసింది.
GVMC Budget: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. మేయర్ పై అవిశ్వాసం నోటీసులతో రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. ఈ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది.
భీమిలి తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.. భీమిలి అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్.. విచారణ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు..
Off The Record: పదిహేనేళ్ళ పాటు బద్ద శత్రువుల్లా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఇప్పుడు మందు, సోడాలా మిక్స్ అయిపోయారట. జానీ వాకర్ మీద ఒట్టేసి చెబుతున్నాం... ఇక మాది దోస్త్ మేరా దోస్త్ బంధం అంటున్నారట. అస్సలు జీవితంలో ఊహించని ఈ పరిణామంతో విశాఖ జనం ఉక్కిరి బిక్కిరి అయిపోయి, అమ్మనీ.... అంతా లిక్కర్ డ్రాప్స్ మహిమ అంటున్నారట.
సాగర నగరం విశాఖపట్నంలో బైక్ రేసింగ్‌లకు కళ్లెం వేయడానికి సీసీ శంఖ బ్రతబాగ్చి దృష్టిసారించారు. వీకెండ్స్‌లో బైక్‌రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రత్యేక నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గతవారం రోజుల్లోనే 54 మంది రేసర్లను పోలీసులు పట్టుకున్నారు. గతంలో నగరశివారు ప్రాంతాల్లో అకస్మాత్తుగా జరిగే రేసింగ్‌లు.. వీకెండ్స్‌లో సాధారణంగా మారిపోయాయి.
విశాఖపట్నంలో ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ సంస్థకు షాక్ మీద షాక్ తగులుతోంది. సుమారు 500 కోట్ల రూపాయల విలువైన 12.5 ఎకరాలను స్వాధీనం చేసుకున్న జిల్లా యంత్రాంగం.. వాటిని 22ఏ జాబితాలో చేర్చింది. నిషేధిత భూములుగా నోటిఫై చేయడంతో రిజిస్ట్రేషన్ పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హయగ్రీవ ఫార్మ్ అండ్ విల్లాస్ అక్రమాలు పుట్ట పగిలింది. వృద్ధులు, అనాథల పేరుతో తక్కువ ధరకు భూములు తీసుకుని వేల కోట్లు వ్యాపారం చేసిన రియల్టర్లుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నగరంలో అత్యంత వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.